ఒకప్పుడు కేబుల్ టీవీ చావకగానే ఉండేది.. కానీ రానురాను చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. రేట్లు పెరిగిపోయాయి.. డిజిటలైజేషన్ అయిన తర్వాత ప్రతి ఛానల్‌ను కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకు నచ్చిన ఇష్టమైన ఛానల్స్ కొనుక్కోవడానికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రూ.160కే మీకు అన్ని ఛానల్స్ వస్తే! మీ కేబుల్ టీవీ బిల్లు 14 శాతం తగ్గిపోతే! ఇదేలా అంటారా? ఎలాగో చూద్దాం..!
ఇదెలా సాధ్యమైంది...
బ్రాడ్‌కాస్ట్ నియంత్రణ సంస్థ ఇటీవలే కొత్తగా రెగ్యులరేటరి నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం కేబుల్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ కేబుల్ టీవీ యూజర్లకు తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. 2020 మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు, ధరలు అమల్లోకి రానున్నాయి. నెలకు కేవలం రూ.160 చెల్లిస్తే డైరెక్ట్ టు హోమ్ లేదా కేబుల్ బిల్స్ 14 శాతం తక్కువ ధరకే అన్ని ఛానల్స్ వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాక వినియోగదారులకు నచ్చిన ఛానల్స్‌ను ఎంచుకునే విధంగా కూడా ఈ నిబంధనలను సరళతరం చేశారు.
ఈ ఛార్జీల ఎఫెక్ట్ ఎంత?
ఈ కొత్త నిబంధనల ప్రకారం గత ఛార్జీల కంటే తక్కువగా కేబుల్ బిల్స్ వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆల్ ఫ్రీ ఎయిర్ ఛానల్స్‌తో పాటు మాగ్జిమమ్ నెట్‌వర్క్ కెపాసిటీ ద్వారా రూ.130కే దాదాపు 200 ఛానల్స్‌ను వీక్షించే అవకాశం ఉందట. ఎక్కువమంది వీక్షించే స్పోర్ట్స్ ఛానల్స్ ధరలను నెలకు రూ.19 నుంచి రూ.12కు తగ్గిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2017 కొత్త ట్రాయ్ చట్టం ప్రకారం ఉచితంగా ఇచ్చే చానల్స్‌కు అదనంగా.. కొన్ని పెయిడ్ ఛానల్స్‌ను ఎంచుకునే అధికారం వినియోగదారులకు ఉంటుంది. అయితే స్పోర్ట్స్, సినిమా లాంటి ఎక్కువ వ్యూవర్‌షిప్ ఉన్న ఛాన్సల్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటి ధరలను తగ్గించి ఈ యాక్ట్‌ను సవరించాలని ట్రాయ్ నిర్ణయించింది.