దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న భారత మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్ వచ్చే ఏడాది మార్చి నాటికి 3జీ నెట్‌వర్క్ సేవలను దేశవ్యాప్తంగా నిలిపి వేయనున్నట్లు వెల్లడించింది.తొలుత కోల్‌కతా సర్కిల్‌తో ఈ ప్రక్రియను మొదలుపెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా సేవలను ఆపివేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ ఇండియా, దక్షిణాసియా విభాగ సీఈఓ గోపాల్ విఠల్ తెలిపారు. సెప్టెంబరు నాటికి మరో 6-7 సర్కిళ్లలో నిలిపివేయనున్నామని తెలిపారు. 2020, ఏప్రిల్ నాటికి తమ నెట్‌వర్క్ కేవలం 2జీ, 4జీ కస్టమర్లను మాత్రమే కలిగి ఉండనుందని ఆయన అన్నారు. మార్జిన్లతోపాటు ఒక్కో కస్టమర్‌పై ఆర్జించే సరాసరి ఆదాయాన్ని(ఏఆర్‌పీయూ) పెంచుకోవడంపైనే పూర్తి దృష్టిసారించినట్లు కంపెనీ పేర్కొంది.
LTE పై అందించే 3జీ సర్వీసులో అదనంగా 900మెగాహెడ్జ్ తో కలిపి మొత్తాన్ని షట్ డౌన్ చేశాం. ఈ ప్రయోగం బాగా పనిచేసింది. సెప్టెంబర్ నాటికి మరో 6 నుంచి 7 సర్కిల్స్ లో కూడా 3G సర్వీసులను షట్ చేయనున్నాం. డిసెంబర్ నుంచి మార్చి నాటికి మొత్తం 3G నెట్ వర్క్ షట్ డౌన్ చేయనున్నట్టు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) బాదల్ బాగ్రి తెలిపారు. చాలా సర్కిళ్లలో 10 నుంచి 15మెగాహెర్ట్జ్ మధ్య 2వేల 1వంద బ్యాండ్ స్పెక్ట్రమ్ ఉన్నట్టు ఆయన తెలిపారు.
టెలికాం రంగ దీర్ఘకాల మనుగడకు చార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని కంపెనీ అభిప్రాయపడింది. కంపెనీ నెట్‌వర్క్‌లోకి కొత్తగా 84 లక్షల మంది 4జీ కస్టమర్లు చేరారు. దీంతో కంపెనీ నెట్‌వర్క్‌లో డేటా సేవలందుకుంటున్న వినియోగదారుల సంఖ్య 12 కోట్లకు చేరుకుంది. అందులో 4జీ యూజర్ల వాటా 9.5 కోట్లు. తమ కస్టమర్లు సరాసరిగా నెలకు 11జీబీ డేటా వినియోగించుకుంటున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అసాధారణ స్థితిలో రూ.1వెయ్యి 469.40 కోట్లు నష్టపోయింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.362.10 కోట్లు నష్టపోయింది. కానీ, సగటున ఆదాయం అదే జూన్ త్రైమాసికంలో ఒక యూజర్‌కు (ARPU) రూ.129కు పెరిగింది. ఏడాది క్రితం జూన్ త్రైమాసికంలో రూ.105 వరకు పెరిగింది. 16 దేశాల్లో జూన్ త్రైమాసికం ముగిసే నాటికి మొత్తం మీద ఎయిర్ టెల్ కస్టమర్ బేస్ 403.7 మిలియన్ల దగ్గర నిలవగా ఏడాదిపరంగా పరిశీలిస్తే 10.9 శాతం వరకు తగ్గిపోయింది.
తొలి త్రైమాసికంలో ఎయిర్ టెల్ కస్టమర్ల సంఖ్య 95 మిలియన్లు ఉండగా ఇందులో 9 మిలియన్ల మంది కస్టమర్లు పెరిగారు. ఎయిర్ టెల్ 26వేలకు పైగా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ బేసిడ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ టెల్ ARPU రూ.129 ఉండగా కస్టమర్ బేస్ 99శాతానికి పైగా ఉంది. కస్టమర్ బేసిడ్ నుంచి నెలవారీ డేటా వాడకం సగటున నెలకు 11.7GB వరకు ఉంది.