int(5534) ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం నుంచి బ్రహ్మాండమైన ఆఫర్ - Computervignanam - Telugu Technology News

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం నుంచి బ్రహ్మాండమైన ఆఫర్

ఎయిర్‌టెల్ తన ఎక్స్‌ట్రీం ఫైబర్ హోం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఇండిపెండెన్స్ డే కానుకగా కళ్ళు చెదిరే ఆఫర్ ప్రకటించింది. కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి అదనంగా 1000 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్‌ అన్ని ఎక్స్‌ట్రీం ఫైబర్ ప్లాన్లపైనా వర్తిస్తుంది. అయితే పరిమిత కాలం వరకే ఈ ఆఫర్ అందుబాటులో  ఉంటుంది. దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లోనూ ఈ ఆఫర్ లభిస్తుంది.

మినిమం ప్లాన్ నెలకు రూ. 799

ఈ ఆఫర్ పొందాలంటే నెలకు కనీసం రూ. 799 కనీస ప్లాన్‌తీసుకోవాలి. డేటాతో పాటు ఏడాదిపాటు  అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం కంటెంట్, వింక్ మ్యూజిక్ ఫ్రీ అని ఎయిర్‌టెల్  ప్రకటించింది.

*1000 జీబీ అదనపు డేటా ఆరు నెలల్లోగా వాడుకోవాలి.

* 1జీబీపీఎస్ వేగంతో డేటా లభిస్తుంది.

airtel extreme fiber indepandance day offer free data amazan prime subscription