• తాజా వార్తలు

IPL వీక్షణ కోసం BSNLవినియోగదారులకు బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవే 

దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు పోటీ పెరుగుతూ వస్తోంది. టెలికం సంస్థలు సబ్‌స్క్రైబర్లను ఆకర్షించేందుకు వినూత్నమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అదీగాక ఇప్పుడు ఐపిఎల్ 2019 నడుస్తుండటంతో టెలికాం దిగ్గజాలన్నీ యూజర్లను అకట్టుకునే పనిలో పడ్డాయి. చౌక డేటా ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ టెలికం రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ఓ అడుగు ముందుకేసింది. వినియోగదారుల కోసం ఐపిఎల్ సంధర్భంగా సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అవేంటో ఓ సారి చూద్దాం. 

1.5 జిబి డేటా ప్లాన్: 
ఈ స్కీమ్ కింద రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ ధర రూ.198. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఇతర బీఎస్ఎన్ఎల్ నెంబర్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

3 జిబి డేటా ఆఫర్: 
ఈ ప్లాన్‌లో యూజర్ రోజుకు 3 జీబీ డేటా పొందొచ్చు. అలాగే ఇతర బీఎస్ఎన్ఎల్ నెంబర్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 45 రోజులు. ప్లాన్ ధర రూ.333. 

రూ.186 ప్రిపెయిడ్ రీచార్జ్ ఆఫర్: 
ఈ ప్లాన్ కింద రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ (ముంబై, ఢిల్లీ మినహా) సదుపాయం ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా పంపుకోవచ్చు.

రూ.399 ప్రిపెయిడ్ రీచార్జ్: 
ఈ ప్లాన్ వాలిడిటీ 74 రోజులు. అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపొచ్చు. అలాగే రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు. ఉచిత పీఆర్‌బీటీ సౌకర్యం కూడా ఉంది. 

ఐపీఎల్ ఇతర ప్లాన్లు: 
కంపెనీ ఐపీఎల్ ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.199, రూ.499 ప్రిపెయిడ్ ప్లాన్ల ద్వారా ఉచిత క్రికెట్ ఎస్ఎంఎస్ అలర్టులు పొందొచ్చు. అలాగే అపరిమిత కాల్స్, డైలీ డేటా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రూ.199 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్లో రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు. ఇక రూ.499 ప్లాన్ వాలిడిటీ 90 రోజులు. ఇందులో కూడా రోజుకు 1 జీబీ డేటా వస్తుంది. దీంతో పాటుగా రోజుకు 91 జిబి డేటాను 365 రోజుల పాటు అందిస్తోంది. దీని  ధర రూ. 1498గా ఉంది.
 

జన రంజకమైన వార్తలు