• తాజా వార్తలు

వీడియో స్ట్రీమింగ్ వ‌చ్చాక మ‌నోళ్లు కేబుల్ కనెక్ష‌న్‌ వాడ‌ట్లేదా?

చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీ.. రోజుకి అప‌రిమిత డేటా.. అందుబాటులోనే బోల్డ‌న్ని ఇష్ట‌మైన టీవీ చాన‌ళ్లు.. ఇవ‌న్నీ ఉన్న‌ప్పుడు ఇక టీవీ క‌నెక్ష‌న్ కూడా కావాలా? అంటే వద్దు అనే అంటున్నారు మ‌నోళ్లు! అవును స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ వీడియో స్ట్రీమింగ్ వ‌చ్చాక‌.. డీటీహెచ్‌లు, కేబుల్ క‌నెక్ష‌న్లు ర‌ద్దు చేసుకుంటున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. డిజిట‌ల్ యుగంలో.. టీవీల‌పైనే ఆధార‌ప‌డి లైవ్ చూస్తున్న కుటుంబాలు చాలా త‌క్కువ‌నే చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొంత వ‌ర‌కూ టీవీలు చూస్తున్నా.. న‌గ‌రాల్లో మాత్రం ఇది అంతంత‌మాత్రంగానే ఉంది. 

ఇవీ కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు.. 
`నేను చూడాల‌నుకున్న‌ది.. నాకు బాగా ఇష్ట‌మైన‌ది.. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తాను` అంటూ ఢిల్లీకి చెందిన మీడియా ఎగ్జిక్యూటివ్ సోనాక్షి అవ‌స్తీ తెలిపారు. ఎనిమిది నెల‌ల క్రితం ఆయ‌న శాటిలైట్ టీవీ స‌బ్ స్క్రిప్ష‌న్‌ని తీసివేశారు. ఒక్క‌సారి లైవ్ స్ట్రీమింగ్‌లో వీడియోలు చూడటం అలవాటయితే.. ఇక టీవీలో సీరియ‌ళ్లు చూడ‌టానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు అంటున్నాడు బెంగ‌ళూరుకు చెందిన స్టూటెండ్ భావిక్ శ్రీనాథ్‌! టీవీ షోల‌తో పాటు సినిమాలు కూడా మొబైల్‌లోని ఎక్స్‌బాక్స్ ద్వారా చూస్తాడు. త‌న స్నేహితులు కూడా ఇదే ప‌ద్ధ‌తి ఫాలో అవుతున్నారు. వారి ఇళ్ల‌లో  డీటీహెచ్ సెట‌ప్ బాక్సులు, టీవీ క‌నెక్ష‌న్లు ఉండ‌వట. ప్ర‌స్తుతం ఇలాంటి వారు పెరుగుతూ ఉన్నారు. 

డిష్ టీవీ కొత్త స్ట్రీమింగ్‌ యాప్‌
నెట్‌ఫ్లిక్స్‌, హ‌ట్‌స్టార్‌, అమెజాన్ ప్రైమ్ వీడియోని ఎక్కువ‌గా లైవ్ స్ట్రీమింగ్ స‌ర్వీసులు అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల మెట్రో న‌గ‌రాల్లో గ‌ణ‌నీయంగా క‌నెక్ష‌న్లు త‌గ్గుతున్నాయ‌ని దేశంలోనే ఎక్కువ‌మంది వినియోగిస్తున్న‌ డీటీహెచ్ ఆప‌రేట‌ర్ డిష్ టీవీ సీఈవో అనీల్ దువా తెలిపారు. అయితే డీటీహెచ్ స‌ర్వీసులు అందిస్తున్న వారు ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇప్ప‌టికీ త‌మ సర్వీసును వినియోగిస్తున్న వారు అధిక సంఖ్య‌లో ఉంటార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ట్రెండ్‌కు అనుగుణంగా త్వ‌ర‌లో తాము లైవ్ స్ట్రీమింగ్ అందించే ఓటీటీ (ఓవ‌ర్ ద టాప్‌) యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు. 

ఓటీటీలోకి టైమ్స్ గ్రూప్ కూడా.. 
అమెరికాకు చెందిన‌ నెట్‌ఫ్లిక్స్ రెండేళ్ల క్రితం భార‌త్‌లో అడుగుపెట్ట‌డంతో.. ఈ ఓటీటీ మార్కెట్ విప‌రీతంగా పెరిగింది. ఇక హాట్ స్టార్‌, అమెజాన్ ప్రైమ్ వంటివి కూడా ఈ రంగంలో భారీ పెట్టుబ‌డులు పెట్టి.. కొత్త వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి. న్యూస్‌పేప‌ర్ ప‌బ్లిషింగ్ సంస్థ టైమ్స్ గ్రూప్ కూడా ఈ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టింది. ద‌క్షిణ కొరియాకు చెందిన ఎంఎక్స్ ప్లేయ‌ర్‌ను రూ.1000 కోట్ల‌తో కొనుగోలు చేసింది. అక్టోబ‌ర్లో ఎంఎక్స్ సంస్థ ఓటీటీ సర్వీసును ప్రారంభించ‌బోతోంది. దాదాపు 50 వేల గంట‌లు వీక్షించే కంటెంట్‌తో దీనిని అందుబాటులోకి తీసుకురానుంది. 

ఎందుకీ ఓటీటీపై ఆస‌క్తి?
భార‌త్‌పై ఈ సంస్థ‌లు దృష్టిసారించ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. 2022 నాటికి  ప్ర‌పంచ వ్యాప్తంగా ఒటీటీ వీడియో మార్కెట్ గ‌ల 10 దేశాల్లో భార‌త్ కూడా నిల‌వ‌బోతోంది. దీని విలువ రూ.5,595 కోట్లు ఉంటుంద‌ని ఆడిట్‌, క‌న్స‌ల్టెన్సీ సంస్థ పీడ‌బ్ల్యూసీ అభిప్రాయ‌ప‌డింది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ విలువ రూ.2,019 కోట్లు ఉంద‌ని సీఏజీఆర్‌లో దాదాపు 23 శాతం వృద్ధి ఉంటుంద‌ని తెలిపింది. వ‌చ్చే నాలుగేళ్ల‌లో ఇది 80 శాతం వ‌ర‌కూ పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ఫ‌లితంగా పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ల నుంచి ఆదాయం ఉత్ప‌త్తి అవుతుంద‌ని వివ‌రించింది. 

ప్ర‌ధాన వినోద వ‌న‌రు స్మార్ట్‌ఫోన్‌
దాదాపు 50 కోట్ల మందికి ప్ర‌ధాన వినోద‌పు వ‌న‌రుగా స్మార్ట్‌ఫోన్ మారింద‌ని ఎంఎక్స్ ప్లేయ‌ర్ సీఈవో కిర‌ణ్‌ బేదీ తెలిపారు. ఎన్నో ర‌కాల వైవిధ్యమైన అంశాల‌కు సంబంధించి వివ‌రాలు పెద్ద లైబ్రరీ రూపంలో వారికి అందుతోంద‌న్నారు. గ‌త ఏడాదితో పోల్చితే ఆన్‌లైన్ వీడియో వినియోగం దాదాపు ఐదు రెట్లు పెరిగింద‌ని ఒక నివేదిక‌లో హాట్ స్టార్ తెలిపింది. దాదాపు 96 శాతం వినియోగం ఎక్కువ నిడివి గ‌ల వీడియో రూపంలోనే ఉంద‌ట‌. గ‌తంలో డేటా చార్జీలు త‌క్కువ‌గా ఉండ‌టంతో.. త‌క్కువ మొత్తంలో వీడియోలు చూసేందుకు ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డే వార‌ని నివేదిక‌లో వివ‌రించింది.

డేటా చార్జీల్లో త‌గ్గుద‌ల‌
మార్కెట్ విస్తృతి పెరుగుతుండ‌టంతో డేటా చార్జీల్లోనూ క్రమంగా త‌గ్గుద‌ల మొద‌లైంద‌ని మార్కెట్ నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. గ‌త మూడేళ్ల‌తో పోల్చితే దేశంలో ఒక్కో వ్య‌క్తి నెల‌కు స‌గ‌టున వినియోగించే డేటా శాతం 15 రెట్లు పెరిగి 4 జీబీకి చేరింది. అంతేగాక నెల‌కు ఎయిర్‌టెల్‌ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వ‌ర్క్ క‌నెక్ష‌న్ ద్వారా 100 జీబీ కంటే ఎక్కువ‌గా వినియోగిస్తున్న వారి సంఖ్య ఏడాదిలోనే రెట్టింపు అయింద‌ని భార‌తీ ఎయిర్‌టెల్ తెలిపింది. ఇదే స‌మ‌యంలో స‌గ‌టున డేటా వినియోగం కూడా 100 శాతం పెరిగింద‌ని కంపెనీ ప్ర‌తినిధి వివ‌రించారు. ప్ర‌స్తుతం త‌మ టీవీల ద్వారానే ఎక్కువ మంది లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్నార‌నేందుకు ఇదే సంకేత‌మని తెలిపారు. 

స్మార్ట్ టీవీల‌కు పెరిగిన ఆద‌ర‌ణ‌
ఈ ఓటీటీ స‌ర్వీస్ వినియోగంతో స్మార్ట్ టీవీల ధ‌ర‌ల్లోనూ మార్పులు జరిగాయి. ప్ర‌స్తుతం పెద్ద‌ స్మార్ట్ టీవీల అమ్మ‌కాలు కూడా ఇందుకు నిద‌ర్శ‌నం. సాధార‌ణ టీవీల అమ్మ‌కాల్లో 10 శాతం వృద్ధి ఉంటే.. 55 అంగుళాల టీవీలు, అంత‌కు మించిన వాటి అమ్మ‌కాలు 50 శాతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న ట్రెండ్‌ని అందిపుచ్చుకుని లాభాలు ఆర్జించేం దుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్లేయ‌ర్లు పోటీ ప‌డుతున్నాయి. టెక్నాల‌జీ రూపురేఖ‌లు మార్చి వీడియో స్ట్రీమింగ్ అందించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు అమెజాన్‌..  High Efficiency Video Coding (HEVC) టెక్నాల‌జీని FireTV Stickలో అందిస్తోంది. 

క్వాలిటీ+త‌క్కువ ధ‌ర.. 
కేబుల్ టీవీ క‌నెక్ష‌న్‌ అత్యంత చ‌వ‌కగా అందుబాటులో ఉండ‌గా, కొన్ని ఓటీటీ ప్లేయ‌ర్లు చాలా ఖ‌రీదైన‌వి మ‌ల్టీనేష‌న‌ల్ ఆడ్వైర్‌టైజింగ్ సంస్థ డ‌బ్ల్యూపీపీకి మేనేజ‌న్ సీవీఎల్ శ్రీ‌నివాస్ తెలిపారు. దేశంలో చాలామంది ప్ర‌జ‌లు ఇదే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని వివ‌రించారు. మ‌రింత మెరుగైన నాణ్యత‌తో కూడిన స‌ర్వీసును అత్యంత త‌క్కువ ధ‌ర‌కే అందిస్తే.. మ‌రింత వేగంగా ప్ర‌జ‌ల‌కు ఈ స‌ర్వీసు చేరేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు.

జన రంజకమైన వార్తలు