int(5533)
జియో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భారీ ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలల వరకు ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ అందిస్తామని ప్రకటించింది. జియోఫై ధర రూ. 1,999.
రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేయాలి. దీనిలో జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సిమ్ యాక్టివేట్ అయిన గంట తర్వాత ప్లాన్ అమల్లోకి వస్తుంది. మై జియో యాప్ ద్వారా యాక్టివేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఐతే 5 నెలల వరకు డేటా ఫ్రీ అన్న జియో,ఎంత డేటా ఇస్తుంది, ఎప్పటి నుంచి వంటి వివరాలేవీ ప్రకటించలేదు.
ఈ ఆఫర్‌ను పొందేందుకు వినియోగదారులు తొలుత జియోపై ఉన్న 3 ప్లాన్లలో ఒకదానితో రీఛార్జి చేయించుకోవాలని మాత్రం చెప్పింది .
*రూ.199 ప్లాన్ *
ఇది జియోఫైలో ఉన్న అత్యంత చవకైన ప్లాన్. ఇందులో రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. వాలిడిటీ 28 రోజులు. జియో ప్రైమ్ సభ్యత్వం కావాలంటే రూ. 99తో అదనంగా రీచార్జ్ చేసుకోవాలి . అలాగే, అదనంగా రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అపరిమిత ఉచిత కాల్స్, జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌ల కోసం 1000 నిమిషాలు లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఫ్రీ .
*రూ. 249 ప్లాన్ *
ఇది రెండో ప్లాన్. దీనిలో రోజుకు 2జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ప్రైమ్ సభ్యత్వం కోసం రూ. 99 చెల్లిస్తే అదనంగా రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. జియోకు అపరిమిత కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు 1000 నిమిషాలు 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఫ్రీ.
*రూ. 349 ప్లాన్ *
ఇది మూడో ప్లాన్. దీనిలో రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. వాలిడిటీ 28 రోజులు. జియో ప్రైమ్ మెంబర్షిప్ కోసం రూ. 99 చెల్లిస్తే అదనంగా రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. జియో టూ జియో, ఇతర నెట్వర్కులకు కాల్స్ అన్నీ మిగతా వాటిలానే ఫ్రీ. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఫ్రీ.
jio fi indepandance day oofer different plans