ప్రస్తుత కంప్యూటర్ ప్రపంచంలో ఏ పనిచేయాలన్నా.. ఏ లావాదేవీ నిర్వహించాలన్నా.. గూగులాయనమః అనాల్సిందే! గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లలో ఎవరి అకౌంట్ వారికి ఉంటుంది. అది బ్యాంకైనా... షాపింగై నా.. మరేదైనా.. ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క అకౌంట్ సొంతం. ఆయా అకౌంట్లలో మన ఆధార్, పాన్ సహా.. అనేకవ్యక్తిగత వివరా లు నమోదై ఉంటాయి. విజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందిందో.. ఆ విజ్ఞానం వెంటే.. నేరాలు కూడా అంతే విశృంఖలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
సైబర్ నేరస్తులు విచ్చలవిడిగా చేస్తున్న దాడులతో కంప్యూటర్లలోని మన పర్సనల్ అకౌంట్ డేటా ఒక్క చిటికెలో వారి సొంతమవుతున్నాయి. మరి ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం.. ఆన్‌లైన్‌లోని మన అకౌంట్లకు ఉన్న పాస్ వర్డ్స్‌ను తరచుగా మారుస్తుండడమే అంటున్నారు మెకాఫీ సంస్థ వ్యవ స్థాపకులు. ఫైనాన్స్, ఆఫీస్, వ్యక్తిగతానికి సంబంధించిన ఏ సమాచారమైనా.. భద్రంగా ఉం డాలంటే తరచుగా పాస్ వర్డ్స్‌ను మార్చుకోవడం, ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించడం ఒక్కటే.. మన ముందున్న భద్ర తా చర్యల్లో కీలకమని అంటున్నారు.
`ప్రపంచ పాస్ వర్డ్ డే`(ప్రతి ఏటా మే నెలలో వచ్చే తొలి గురువారం)ను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ పాస్ వర్డ్స్ భద్రతను సరిచూసుకోవడం, అవసరమైతే.. కొత్తగా పాస్ వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఈ క్రమంలో మెకాఫీ ఫౌండర్ చెబుతున్న ఆరు చిట్కాలను పాటించ డం ద్వారా మీ పాస్‌వర్డ్స్‌ను మరింత భద్రంగా ఉంచుకునే అవకాశం ఉంది. మరి అవేంటో చూద్దామా..
1. పాస్‌వర్డ్స్ బహిర్గతమవుతున్నాయా? : ఆన్‌లైన్‌లోని మన అకౌంట్లకు ఉన్న పాస్‌వర్డ్స్‌పై నిత్యం కన్నేసి ఉంచాలి. ఆయా పాస్‌వర్డ్స్ ఎక్కడైనా బహిర్గతం అవుతున్నాయా? లేక `స్టార్` రూపంలోనే వస్తున్నాయా? అనే విషయాన్ని పరిశీలించాలి. మరి దీనికి `హెచ్ ఏవీఈ ఐబీఈఈయపీడబ్ల్యుఎన్ ఈడీ.కామ్` అనే సైట్‌లోకి మీ పాస్ వర్డ్స్ పరిస్థితిని నిశితంగా గమనించే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే వాటిని మార్చుకోవచ్చు.
2. పాస్‌వర్డ్స్ పదాలు ఎలా ఉండాలి: సాధారణంగా పాస్‌వర్డ్స్‌లో ఎక్కడా కూడా కామన్‌గా అందరూ గెస్ చేయగలిగిన పదాలు వినియోగించొద్దు. అదేవిధంగా పర్సనల్ డేటాను అస్సలే ఉంచొద్దు. ముఖ్యంగా బర్త్ డే వివరాలు, ఫ్యామిలీ వివరాలు, పెంపుడు జంతువుల పేర్లను కూడా వాడొద్దు. వీటిని కనుక వినియోగిస్తే.. గుర్తించడం చాలా సులువు. అందుకే
పాస్ వర్డ్స్‌ను ఎప్పుడూ జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి.
3. పాస్ వర్డ్స్ భద్రత ఇలా: పాస్ వర్డ్స్ భద్రత చాలా ముఖ్యం. దీనికి సంబంధించి ఏం చేయాలో చూద్దాం.. ఏ పాస్ వర్డ్ లో నైనా వివిధ క్యాపిట్ లెటర్స్‌ను వినియోగించాలి. లోయర్ కేస్ లెటర్స్‌ను వాడాలి. నంబర్లను, సింబల్స్‌ను వినియోగించాలి. ఈ రోజుల్లో ప్రతి ఎకౌంట్‌కు పాస్ వర్డ్ అవసరం ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పాస్ వర్డ్‌ను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
4. ప్రతి అకౌంట్‌కు విభిన్నంగా: ఆన్‌లైన్‌లో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కనీసం రెండు నుంచి నాలుగైదు వరకు కూడా అకౌంట్లు ఉంటున్నాయి. అవి బ్యాంకులైనా.. అమెజాన్ వంటి షాపింగ్ సంస్థలైనా. ఆయా అకౌంట్లకు ఖచ్చితంగా పాస్ వర్డ్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్క అకౌంట్‌కు కొత్త పాస్ వర్డ్ పెడితే.. ఎక్కడ మరిచిపోతామోనని భావించి చాలా మంది ఒక పాస్ వర్డ్‌నే అటు ఇటు మార్చి .. అన్ని అకౌంట్లకు పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఇది మంచి విధానం కాదని అంటున్నారు నిపుణులు. ప్రతి పాస్ వర్డ్‌కు మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
5. పాస్ వర్డ్ మేనేజర్‌ను వాడదాం: పాస్ వర్డ్ మేనేజర్ ను వినియోగించి అన్ని అకౌంట్లలోని పాస్ వర్డ్స్‌ను భిన్నమైన విధానంలో మార్చుకునే వెసులుబాటు ఉంది. ఈక్రమంలో పాస్‌వర్డ్‌లోని కొన్ని పదాలను ఎప్పుడైనా మరిచిపోతే.. వెంటనే పాస్‌వర్డ్ మేనేజర్ ద్వారా వాటిని ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంది. పాస్ వర్డ్ మేనేజర్ విధానంలో ఏర్పాటు చేసుకునే పాస్ వర్డ్ కఠినంగా ఉండడం గమనార్హం. అయితే, దీనిని మరిచిపోయే ప్రమాదం ఉందని భయపడేవారికి మరో అవకాశం కూడా ఉంది. ఈ మొత్తం పాస్ వర్డ్‌లో ఒక మాస్టర్ వర్డ్‌ని గుర్తుంచుకుంటే.. మిగిలినవర్డ్‌ని మేనేజర్ ట్రాక్ చేస్తుంది.
6. రెండు లేదా మరిన్ని ఫాక్టర్లతో : అవును. మన పాస్ వర్డ్‌ను సైబర్ నేరస్తులు గెస్ చేయకుండా ఉండాలంటే.. ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలి. మన పాస్ వర్డ్‌లో రెండు లేదా మరిన్ని ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మనకు తప్ప ఎవరికీ తెలిసే/ ఊహించే అవకాశం కూడా ఉండదు. ఫలితంగా ఆన్‌లైన్‌లో మన అకౌంట్ భద్రంగా ఉంటుంది.