• తాజా వార్తలు

శాంసంగ్ ఫోన్‌లో యాడ్స్‌ను డిసేబుల్ చేయ‌డం ఎలా?


అధునాత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌తో, రోజుకో కొత్త టెక్నాల‌జీతో మొబైల్ విప‌ణిని ముంచెత్తుతున్నాయి స్మార్ట్ ఫోన్లు! ఈ క్ర‌మంలో ఏ కంపెనీ ప్ర‌త్యేక‌త ఆ కంపెనీదే. ద‌క్షిణ కొరియాకు చెందిన ప్ర‌ముఖ ప‌ట్ట‌ణం పేరుతో మొబైల్ వాణిజ్యాన్ని శాసిస్తున్న  `శాంసంగ్` స్మార్ట్ ఫోన్ల‌దీ అదే రేంజ్ డిమాండ్. ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు, చేర్పుల‌తో దూసుకుపోతున్న ఈ కంపెనీ తాజాగా `ఏ-50` సిరీస్‌తో మొబైళ్ల‌ను మార్కెట్ల‌లోకి తీసుకు వ‌చ్చింది. చాలా స్మార్ట్‌గా బ్యాక్ మిర్ర‌ర్ క‌వ‌ర్‌తో వ‌చ్చిన ఈ  మొబైళ్లు చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉండి, వినియోగ‌దారుడి మ‌న‌సును దోచుకుంటున్నాయి. 

అయితే, `ఏ-50` సిరీస్‌ ఫోన్ల‌లో మ‌న ప్ర‌మేయం లేకుండానే యాడ్లు జోరెత్తుతుండ‌డం ఇప్పుడు పెద్ద స‌మస్య‌గా మారింది.  మ‌రి వీటిని ఎలా డిజేబుల్ చేయాలి? అనేది వినియోగ‌దారుల ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రి దీనికి ప‌రిష్కారం ఏంటో తెలుసుకుం దాం. ఏ-50 ఫోన్ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. కొత్త‌గా కొనుగోలు చేసిన ఫోన్‌ను ఆన్ చేసిన వెంట‌నే తొలుత `కంట్రీ`ని సెల‌క్ట్ చేయాలి. అయితే, సాధార‌ణంగా వినియోగదారులు ఈ విష‌యంలో చాలా నిర్ల‌క్ష్యంగా ఉంటూ.. తెర‌పై క‌నిపించిన అన్ని ఆప్ష‌న్ల‌ను సెల‌క్ట్ చేయ‌డం ప‌రిపాటి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. 

ఒక్కొక్కటీ ప‌రిశీలిద్దాం...

చెక్ అవుట్ సమ్ ఇన్ఫో:  ఫోన్ ఓపెన్ చేయ‌గానే తెర‌మీద క‌నిపించే ఈ నోటీసును జాగ్ర‌త్త‌గా చ‌ద‌వాలి. దీనికింద ఐదు ఆప్ష‌న్లు ఉంటాయి. వీటిలో మ‌న‌కు ఏది ముఖ్య‌మో ఎంచుకుని `నెక్ట్స్‌` అనే సూచ‌న‌పై ప్రెస్ చేయాలి. సాధార‌ణంగా యూజ‌ర్ లైసెన్స్ అగ్రిమెంట్‌, ప్రైవ‌సీ పాల‌సీ.. ఈ రెండు ఆప్ష‌న్లు ఓకే చేస్తే చాలు. మిగిలిన వాటిని డిజేబుల్ చేయాలి. 

బ్రింగ్ యువ‌ర్ ఓల్డ్ డేలా:  చెక్ అవుట్ త‌ర్వాత తెర‌మీద క‌నిపించేది బ్రింగ్ యువ‌ర్ ఓల్డ్ డేటా ఫ‌ర్ క్విక్క‌ర్ సెట‌ప్‌. అయితే, ఇది ఎవ‌రి ఆప్ష‌న్ మేరకు వారు వినియోగించుకోవ‌చ్చు. ఇది పెద్ద స‌మ‌స్య కాదు.

చూజ్ ఏ వైఫై నెట్ వ‌ర్క్‌:  వైఫై నెట్ వ‌ర్క్ ను ఎలో చేసే ఈ ఆప్ష‌న్ కూడా అవ‌స‌రం మేర‌కు వినియోగించుకోవ‌చ్చు. 

రివ్యూ అడిష‌న‌ల్ యాప్స్‌:  ఇది చాలా ముఖ్య‌మైన భాగం. దీనిలో అద‌నంగా ఉండే యాప్స్‌ను గుర్తించాలి. ఈ రివ్యూలో ని ప్ర‌తి యాప్‌ను చాలా నిశితంగా గ‌మ‌నించాలి. అవ‌స‌రం ఉన్న‌వైతే.. ఓకే చేయాలి. లేదంటే రిమూవ్ చేసుకునే వెసు లు బాటు ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ రివ్యూలో `శాంసంగ్ నోట్స్‌` అనే యాప్ ఉంది. దీంతో వినియోగ‌దారుల‌కు పెద్ద గా ఉప‌యోగం ఉండ‌దు. సో.. దీనిని రిమూవ్ చేసుకోవ‌చ్చు. అదేవిధంగా సాంసంగ్ మెంబ‌ర్స్‌, సాంసంగ్ ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్స్, శాంసంగ్ ఈమెయిల్‌ వంటివాటితో ఉప‌యోగం ఉండ‌దు. సాధార‌ణంగా అంద‌రూ జీ-మెయిల్‌నే వినియోగిస్తారు. కాబ‌ట్టి వాటిని రిమూవ్ చేసుకోవ‌చ్చు.

గెట్ రిక‌మెండెడ్‌ యాప్స్‌: ఏ-50 సిరీస్‌లో క‌నిపించే దీనిలో మ‌న‌కు అస‌వ‌ర‌మైన యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే, సాధార‌ణంగా వినియోగ‌దారుల‌కు దీనిపై పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండ‌దు. సో..దీనిని స్కిప్ చేయ‌డం ఉత్త‌మం. 
అదేవిధంగా శాంసంగ్ అకౌంట్‌ను కూడా స్కిప్ చేయొచ్చు. 

లాక్ స్క్రీన్ స్టోరీస్‌: ఇది చాలా ముఖ్య‌మైంది. అయితే, దీనివ‌ల్ల కూడా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. కాబ‌ట్టి స్కిప్ చేయ‌డ‌మే బెట‌ర్‌. 

డిస్క‌వ‌ర్ అండ్ ఇన్‌స్టాల్ గ్రేట్ యాప్స్‌:  దీనిలో మ‌న‌కు అవ‌స‌రం అనుకున్న వాటిని ఎంచుకుని స్కిప్ చేయొచ్చు. అయితే, దీనిక‌న్నా కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎంచుకోవ‌డం బెట‌ర్‌. సో దీనిని కూడా స్కిప్ చేయ‌డం బెట‌ర్‌. దీని త‌ర్వాత క‌నిపించే `ఆల్ డ‌న్‌` సూచ‌న‌లో గ్రీన్ మార్క్‌ను తీసేయ‌డం ద్వారా అన‌వ‌స‌ర‌మైన నోటిఫికేష‌న్ల‌ను దూరం పెట్టేందుకు అవ‌కాశం ఉంది. 

మై గెలాక్సీ:  త‌ర్వాత క‌నిపించే ఆప్ష‌న్స్‌లో ఇది కీల‌మైంది. గూగుల్ ప్లేస్టోర్‌, యూట్యూబ్‌, ఫోన్ చాట్‌, మెయిల్ ఇలాంటి వాటితో క‌లిసి ఉండే మైగెలాక్సీ కార‌ణంగానే మ‌న‌కు అన‌వ‌స‌ర‌మైన నోటిఫికేష‌న్లు ఫోన్ల‌ను ముంచెత్తుతూ ఉంటాయి. కాబ‌ట్టి దీనిని తీసి వేయ‌డం(డిజేబుల్‌) ఉత్త‌మం.  ఈ చిన్న చిన్న ట్రిక్స్‌ను ఉప‌యోగించి శాంసంగం ఏ, ఎం సిరీస్ స‌హా మ‌రిన్ని ఫోన్ల‌లో అన్‌వాంటెడ్ యాడ్స్ ను సుల‌భంగా తొల‌గించ‌వ‌చ్చు. మ‌రి ఇవి పాటించి మీ ఫోన్ల‌ను భ‌ద్రంగా ఉంచుకుంటారు క‌దూ!! 
 

జన రంజకమైన వార్తలు