• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో అన్ని అకౌంట్ల నుంచి ఒకేసారి లాగ‌వుట్ చేయ‌డానికి లాగిఫై

జీమెయిల్‌, ఫేస్‌బుక్,  ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్ ఇలా ఎన్ని ఆన్‌లైన్ అకౌంట్లో.   సాధార‌ణంగా మ‌న పీసీ ముందు కూర్చున్నా ల్యాపీలో ప‌ని చేస్తున్నా ఇవ‌న్నీ ఓపెన్ చేసేస్తున్నాం.  కానీ సిస్టం ష‌ట్ డౌన్ చేసేట‌ప్పుడు అంద‌రికీ హ‌డావుడే. ఆ టైమ్‌లో అన్ని ఆన్‌లైన్ అకౌంట్లు ఒక్కొక్క‌టిగా లాగ‌వుట్ కావాలంటే త‌ల‌నొప్పే. దీనికి ఓ ప‌రిష్కారం ఉంది. అన్ని అకౌంట్ల నుంచి సింగిల్ క్లిక్‌తో లాగ‌వుట్ కాగ‌లిగే ఆ హాం ఫ‌ట్ మంత్రం పేరే.. లాగిఫై.

సులువైన ప‌ద్ధ‌తి
సాధార‌ణంగా మ‌నం పీసీలో లేదా ల్యాపీలో  ఓపెన్ చేసిన ఆన్‌లైన్ అకౌంట్ల‌న్నీ మాన్యువ‌ల్‌గా లాగవుట్ చేస్తాం. లేదంటే బ్రౌజ‌ర్ హిస్ట‌రీని కూడా క్లియ‌ర్ చేయొచ్చు. అయితే మొద‌టి ప‌ద్ధ‌తిలో టైం వేస్ట్ అవుతుంది. రెండో ప‌ద్ధ‌తిలో కుకీస్ పోతాయి. అలాగే ఆ లాగిన్ సెష‌న్స్‌లో ఉన్న ఇత‌ర డేటా కూడా పోయే ప్ర‌మాదం ఉంది.  ఐతే ఈ రెండింటి కంటే ఈజీ ప‌ద్ధ‌తి లాగిఫై.
లాగిఫై అనేది ఓ వెబ్‌సైట్‌.  మీ ఆన్‌లైన్ అకౌంట్ల‌న్నీ ఒకేసారి లాగ‌వుట్ చేయ‌డానికి దీన్ని వాడుకోవచ్చు.  

* 40 పాపుల‌ర్ వెబ్‌సైట్ల‌ను ఇది ఒకేసారి లాగ‌వుట్ చేయ‌గ‌ల‌దు. గూగుల్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీమెయిల్‌, ఆఫీస్ 360 లాంటి నిత్య‌జీవితంలో మ‌నం వాడుకునే వెబ్‌సైట్ల‌న్నీ ఇందులో ఉంటాయి.

* లాగిఫై వెబ్‌సైట్లో సెంట‌ర్‌లో ఒకే ఒక్క పెద్ద లాగవుట్ బ‌ట‌న్ ఉంటుంది.  ఆ బ‌ట‌న్ క్లిక్ చేస్తే మీరు లాగిన్ అయిన ఆన్‌లైన్ అకౌంట్ల‌న్నీ సింగిల్ క్లిక్‌లో లాగవుట్ అయిపోతాయి.

* ఈ వెబ్‌సైట్‌ను వాడుకోవ‌డానికి ఎలాంటి ప్ర‌త్యేక‌మైన ప‌ర్మిష‌న్లు  అవ‌స‌రం లేదు.

 ఈ లిమిటేష‌న్స్ కూడా ఉన్నాయ్‌
ఐతే లాగిఫై వెబ్‌సైట్‌లో కొన్ని ప‌రిమితులు కూడా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు క్రోమ్ బ్రౌజ‌ర్‌లో లాగిఫై వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే ఆ బ్రౌజ‌ర్‌లో ఓపెన్ చేసిన ఆన్‌లైన్ అకౌంట్ల‌ను మాత్ర‌మే క్లోజ్ చేయ‌గ‌లం. అంటే మీరు ఫైర్‌ఫాక్స్‌, ఒపెరా లాంటి ఇత‌ర బ్రౌజ‌ర్ల‌లో ఓపెన్ చేసిన ఆన్‌లైన్ అకౌంట్ల‌ను సింగిల్ క్లిక్‌తో లాగ‌వుట్ చేయాలంటే వాటిలో కూడా లాగిఫై వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.  

 

జన రంజకమైన వార్తలు