లాక్డౌన్ వచ్చింది. ఫ్రెండ్స్‌తో షికార్లు లేవు. లేట్‌నైట్ మూవీస్ లేవు. ఎన్నాళ్ళని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో ఒక్కళ్ళే మూవీస్ చూస్తూ కూర్చోవాలి.. బోర్ కొడుతుంది అని ఫీలవుతున్నారా?అయితే మీరు, మీ ఫ్రెండ్స్ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని కూడా అందరూ కలిసే సినిమా చూస్తున్న ఫీల్ పొందడానికి ఒక చిట్కా ఉంది. అది ఎలాగో చూడండి.
నెట్ ఫ్లిక్స్ పార్టీ
మీకు మీ ఫ్రెండ్స్‌కి నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రి ప్షన్ వుందా? అయితే నెట్‌ఫ్లిక్స్ పార్టీ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ ద్వారా మీరంతా ఓకే సినిమాను కలిసి చూస్తున్న అనుభూతిని పొందవచ్చు. అదీ ఎవరింట్లో వాళ్లు కూర్చునే.
నెట్‌ఫ్లిక్స్ పార్టీని ఉపయోగించడం ఎలా?
* ముందుగా క్రోమ్ స్టోర్ నుంచి నెట్‌ఫ్లిక్స్ పార్టీ ఎక్స్టెన్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
* ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో ఉన్న ఎక్స్టెన్షన్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి.
* ఇప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిలో Create a Netflix Party అనే ఆప్షన్ వుంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
* ప్లేబ్యాక్ మీద టోటల్ కంట్రోల్ మీకే కావాలా లేకపోతే ఆ ఆప్షన్ ను అందరికీ వదిలేస్తారా అని అడుగుతుంది. మీకు నచ్చిన ఆప్షన్ ఇవ్వండి.
* తర్వాత Start the party ఆప్షన్ క్లిక్ చేయండి. వెంటనే మీకు ఒక లింక్ వస్తుంది. దాన్ని మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబసభ్యులతో షేర్ చేసుకుని ఒకటే మూవీని అందరూ కలిసి ఎంజాయ్ చేయండి.