• తాజా వార్తలు

గూగుల్ మ్యాప్స్‌లో చిటికలో లొకేష‌న్ షేర్, చేయ‌డానికి ఓ ట్రిక్

ఇదివ‌రకు ఎవ‌రిక‌న్నా అడ్ర‌స్ చెప్పాలంటే ఏదో ఒక ల్యాండ్ మార్క్ చెప్పేవాళ్లం.. గుడి ప‌క్క‌నో, ఫ‌లానా బ‌డి ముందో ఇలా ఏదో ఒక  కొండ గుర్తు చెప్పేవాళ్లం. గూగుల్ మ్యాప్స్ వ‌చ్చాక లొకేష‌న్ షేర్ చేసేస్తున్నాం. స్మార్ట్‌ఫోన్‌లో దాన్ని చూసుకుంటూ మ‌న‌వాళ్లు నేరుగా ఆ అడ్ర‌స్‌కు రాగ‌లుగుతున్నారు.  ఈ ఫీచర్‌ను మ‌రింత ఈజీగా మార్చందుకు గూగుల్ సిద్ధ‌మైంది.  ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు గూగుల్ మ్యాప్ యాప్‌లో కొత్త అప్డేట్ తీసుకొచ్చింది.  జ‌స్ట్ ఫోన్ నెంబ‌ర్ షేర్ చేసినంత ఈజీగా మీరున్న ప్లేస్‌ను కూడా ఫ్రెండ్స్‌కు షేర్ చేసేయొచ్చు. 

ప్ల‌స్ కోడ్ కాపీ చేస్తే చాలు
* ఈ కొత్త ఫీచ‌ర్ వాడుకోవ‌డానికి ముందు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని మ్యాప్స్ యాప్ అప్‌డేట్ చేసుకోండి.

* ఇప్పుడు మ్యాప్స్ ఓపెన్ చేయండి.

* మీరున్న లొకేష‌న్‌ను ఒక బ్లూడాట్‌గా మ్యాప్స్ చూపిస్తుంది.

* ఆ బ్లూడాట్ మీద టాప్ చేయండి. 

* ఇప్పుడు ఒక  విండో ఓపెన్ అవుతుంది. దానిలో లొకేష‌న్ అని ఒక ప్ల‌స్ కోడ్‌‌, మీరున్న ఊరు, రాష్ట్రం పేరు క‌నిపిస్తుంది.

* దానిమీద క్లిక్ చేయ‌గానే ప్ల‌స్ కోడ్ కాపీడ్ టు క్లిప్ బోర్డ్ అని చూపిస్తుంది. 

* ఇప్పుడు దాన్ని వాట్సాప్ లేదా మెసేజ్‌గా సెండ్ చేయండి. వాళ్లు మ్యాప్స్‌లో దాన్ని పేస్ట్ చేయ‌గానే మీరున్న లొకేష‌న్ వాళ్ల‌కు తెలిసిపోతుంది.

* ఇది చాలా యాక్యురేట్‌గా ప‌ని చేస్తుంద‌ని గూగుల్ ప్ర‌క‌టించింది. 

జన రంజకమైన వార్తలు