చాలా సందర్భాల్లో మనం పీడీఎఫ్ (ఫోటో డాక్యుమెంట్ ఫార్మాట్) ఫైల్స్ వాడుతుంటాం. అయితే ఇలాంటి పీడీఎఫ్ ఫైల్స్ ఏదయినా గవర్నమెంట్ సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి వచ్చినా, వాట్సాప్ లాంటి వాటిలో సెండ్ చేయాల్సి వచ్చినా పెద్ద సైజ్ ఉంటే పర్మిట్ చేయవు. అందుకు పరిష్కారం పీడీఎఫ్ ఫైల్ సైజ్ తగ్గించడం. అది ఎలా చేయాలో ఈ సింపుల్ టిప్ మీకోసం..
కంప్రెస్ పీడీఎఫ్ ఆన్‌లైన్
* ఇది విండోస్, మాక్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ అన్నింటికీ పనికొచ్చే పద్ధతి.
* ఇందులో మీరు ilovepdf.com అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
* కంప్రెస్ పీడీఎఫ్‌ను క్లిక్ చేయండి.
* తర్వాత పేజీలో సెలెక్ట్ పీడీఎఫ్‌ను టాప్ చేసి మీరు కంప్రెస్ చేయాలనుకున్న పీడీఎఫ్ ఫైల్‌ను సెలెక్ట్ చేయండి.
* ఇప్పుడు మీకు కావాల్సిన సైజ్‌లో పీడీఎఫ్‌ను సైజ్ చేసుకుని కంప్రెస్ పీడీఎఫ్ బటన్ నొక్కండి.
* తర్వాత పేజీలో డౌన్‌లోడ్ కంప్రెస్డ్ పీడీఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
* దాన్ని టాప్ చేస్తే కంప్రెస్ అయిన పీడీఎఫ్ ఫైల్ మీ డివైస్‌లో సేవ్ అవుతుంది.