• తాజా వార్తలు

క్లౌడ్‌లొ మన డేటా సురక్సితంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు

డేటాను వ‌ర్చువ‌ల్ డిస్క్ ద్వారా స్టోర్ చేయ‌డానికి  క్లౌడ్ బాగా యూజ్ అవుతుంది. ఆ డేటా మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ టూల్ మ‌న‌ డేటాను క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో స్టోర్ చేస్తుంది. క్లౌడ్‌లో మీకు స‌ర్వ‌ర్స్‌, స్టోరేజ్ నెట్‌వ‌ర్క్ లాటి స‌ర్వీసులు ఉంటాయి. ఇది ఫాస్ట్ ఇన్నోవేష‌న్, ఫెక్లిబుల్‌, సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఎన్ని ఆప్ష‌న్లు ఉన్నా మ‌న డేటాను సెక్యూర్‌గా ఉంచ‌డం చాలా కీల‌కం. ఇలా క్లౌడ్‌లో డేటాను సెక్యూర్‌గా ఉంచ‌డం కోసం కొన్ని ప‌ద్ధతులు ఉన్నాయి అవేంటో చూద్దాం..

పాస్‌వ‌ర్డ్ మేనేజ్‌మెంట్‌
చాలామందికి పాస్‌వ‌ర్డ్ మేనేజ్‌మెంట్‌పై అవ‌గాహ‌న ఉండ‌దు. ఈమెయిల్ పాస్‌వ‌ర్డ్ మాత్ర‌మే కాదు క్లౌడ్ పాస్‌వ‌ర్డ్ కూడా బ‌లంగా ఉండ‌డం చాలా కీల‌కం. ఎక్కువ‌మంది త‌మ పుట్టినోరోజు లేదా వ‌య‌సును మాత్ర‌మే పాస్‌వ‌ర్డ్‌గా పెట్టుకుంటారు.  ఈ పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఛేదించ‌డం చాలా సుల‌భం. అందుకే అప్ప‌ర్, లోయ‌ర్, నంబ‌ర్స్‌, క్యారెక్ట‌ర్స్‌తో కూడిన బ‌ల‌మైన పాస్‌వ‌ర్డ్ పెడితే మ‌న క్లౌడ్ చాలా సెక్యూర్‌గా ఉంటుంది. ఒకే పాస్‌వ‌ర్డ్‌ని మ‌ల్టీపుల్ అకౌంట్స్‌కి యూజ్ చేయ‌డాన్ని అవైడ్ చేయాలి.

ఎన్‌క్రిప్ట్‌
డేటాను ప్రొటెక్ట్ చేయ‌డానికి ఎన్‌క్రిప్ట్ చాలా ఉత్త‌మ‌మైన ప‌ద్ధ‌తి. మీరు క్లౌడ్‌లోకి పంపాల‌నుకున్న ఫైల్‌కి పాస్‌వ‌ర్డ్ పెట్టుకోవాలి. దీంతో ఎవ‌రూ మీరు పంపిన ఫైల్‌ని చూడ‌లేరు. పాస్‌వ‌ర్డ్ స‌రిగా టైప్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. ఇంకో మార్గం ఏమిటంటే ఒక జిప్ ఫైల్‌ని క్రియేట్ చేసి దానికి పాస్‌వ‌ర్డ్ పెట్ట‌డం. ఈ ఫైల్‌ని పొర‌పాటున ఎవ‌రికి పంపినా వాళ్లు ఫైల్ ప్రొటెక్ట‌డ్‌గా ఉండ‌డం వ‌ల్ల ఓపెన్  చేయ‌డం సాధ్యం కాదు. 

ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ స‌ర్వీస్‌
కొన్ని క్లౌడ్ స‌ర్వీసులు స్టోరేజ్‌, బ్యాక్ అప్‌తో పాటు లోక‌ల్ ఎన్‌క్రిప్ష‌న్ స‌ర్వీసుని అందిస్తున్నాయి. దీని వ‌ల్ల ఈ ఫైల్స్‌కు సంబంధింని పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎవ‌రూ క్రాక్ చేయ‌లేరు. చివ‌రికి స‌ర్వీసు ప్రొవైడ‌ర్స్‌, స‌ర్వ‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్స్‌ల‌కు కూడా ఈ పాస్‌వ‌ర్డ్‌లు తెలియ‌వు. ఈ స‌ర్వీసుల‌ను స్పైవ‌రాక్‌ర వూలా అని కూడా పిలుస్తారు. అయితే డేటా విలువైన‌ది అయితే మాత్ర‌మే ఇలాంటి స‌ర్వీసులు  వాడుకోవ‌డం బెట‌ర్‌. ఎందుకంటే ఇవి పెయిడ్ స‌ర్వీసులు.

జన రంజకమైన వార్తలు