• తాజా వార్తలు

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌, ల్యాప్‌లాప్ లాంటి గాడ్జెట్ల‌ను కూడా క్లీన్ చేస్తున్నారు.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇది అవ‌స‌రం కూడా. అయితే గాడ్జెట్స్ క్లీన్ చేసేట‌ప్పుడు కొన్ని జాగ్రత్త‌లు పాటించ‌క‌పోతే అవి దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. అందుకే ఆ జాగ్రత్త‌ల‌న్నీ  మీ కోసం.

1. కేబుల్స్ తీసేయండి
సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్ ఇలాంటి గాడ్జేట్లేవ‌యినా వాటిని క్లీన్ చేయాలంటే ముందుగా వాటికున్న కేబుల్స్ తీసేయండి. డెస్క్‌టాప్ లాంటివి క్లీన్ చేసేట‌ప్పుడు సిస్టం ష‌ట్‌డౌన్ చేసి స్విచ్ ఆఫ్ చేయండి. గాడ్జెట్ల‌ను స్విచ్ ఆఫ్ చేయండి. 

2. లిక్విడ్ డైరెక్ట్‌గా వేయొద్దు
గాడ్జెట్‌ను క్లీన్ చేయ‌డానికి లిక్విడ్స్ వాడుతుంటాం. అయితే ఆ లిక్విడ్‌ను డైరెక్ట్‌గా దానిమీద వేయొద్దు. ఏదైనా క్లాత్ మీద గానీ దూదిమీద గానీ వేసి దాంతో గాడ్జెట్‌ను తుడవండి. లేక‌పోతే వాటిలోని కొన్ని సున్నిత‌మైన భాగాల్లోకి లిక్విడ్ వెళ్లిపోయి అవి డ్యామేజ్ అవుతాయి. 

3.ఫింగ‌ర్‌ప్రింట్ డిస్‌ప్లే పాడ‌వుతుంది జాగ్ర‌త్త‌
కొన్ని బ్రాండ్స్ గాడ్జెట్లు వాటి డిస్‌ప్లే మీదే ఫింగ‌ర్‌ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్‌ను ఉంచుతాయి. కొన్ని ర‌కాల లిక్విడ్స్ ఈ కోటింగ్‌ను దెబ్బ‌తీస్తాయి. కాబట్టి ఇలాంటి లిక్విడ్స్ వాడేట‌ప్పుడు గాడ్జెట్ మీద స్క్రీన్‌గార్డ్ వేయండి.   

4.ఇన్‌లెట్స్‌లోకి లిక్విడ్ వెళ్ల‌నివ్వ‌కండి
యూఎస్‌బీ పోర్ట్‌, స్పీక‌ర్‌, మైక్‌, కెమెరాలు వీట‌న్నింటిలోకి లిక్విడ్ లేదా నీళ్లు లాంటివి వెళితే అవి ప‌నికిరావు. కాబట్టి వాటిలోకి మీ క్లీనింగ్ లిక్విడ్ వెళ్ల‌కుండా చూసుకోండి. 

5.యాపిల్‌కు నో లిక్విడ్‌
ఐఫోన్‌, ఐప్యాడ్‌లాంటి యాపిల్ ప్రొడ‌క్ట్స్ మీద ఎలాంటి క్లీనింగ్ లిక్విడ్స్ వేయొద్దు. నీళ్లు, 70% ఐసో ప్రొఫైల్ ఆల్క‌హాల్ క‌లిపి మైక్రో ఫైబ‌ర్ క్లాత్ మీద వేసి దానితో ఈ ప్రొడ‌క్ట్స్‌ను తుడ‌వాలి.  

6.వైప్స్ వాడొచ్చు
ముఖం క్లీన్ చేసుకోవడానికి వాడే వైప్స్ తో మీ గాడ్జెట్స్ క్లీన్ చేసుకోవ‌డం మంచి ఆప్ష‌న్‌. 

7.మైక్రో ఫైబ‌ర్ క్లాత్ బెట‌ర్‌
మీరు క్లీన్ చేసేట‌ప్పుడు డిస్‌ప్లే మీద గీత‌లు అవీ పడ‌కుండా ఉండాలంటే మైక్రో ఫైబ‌ర్ క్లాత్ వాడాలి. దీన్ని కొద్దిగా త‌డిపి క్లీన్ చేసుకోవ‌చ్చు. 

8.త‌డి ఆరే వ‌ర‌కు వెయిట్ చేయండి 
మీరు గాడ్జెట్స్‌ను లిక్విడ్‌తో క్లీన్ చేశాక వాటిని మ‌ళ్లీ ఆన్ చేసేట‌ప్పుడు ఆ లిక్విడ్ త‌డి ఆరే వ‌ర‌కు వెయిట్ చేయండి. లేక‌పోతే ఆ తడి గాడ్జెట్ల‌లో చేరి షార్ట్ స‌ర్క్యూట్ అయ్యే ప్ర‌మాదం ఉంది. 

9.చేతులు క్లీన్ చేసుకోండి
మీ గాడ్జెట్స్ క్లీన్ చేసుకోవ‌డం పూర్త‌య్యాక మీ చేతుల‌ను స‌బ్బుతో 20 నుంచి 40 సెక‌న్ల పాటు క‌డుక్కోవ‌డం మరిచిపోకండి. ఎందుకంటే మ‌న గాడ్జెట్ల మీద టాయిలెట్ సీట్ మీద కంటే చాలా ఎక్కువ రెట్లు క్రిములు ఉంటాయ‌ట‌. కాబట్టి బీ కేర్‌ఫుల్‌. 

జన రంజకమైన వార్తలు