• తాజా వార్తలు

అన‌వ‌స‌ర‌మైన‌ వాట్సాప్ గ్రూప్స్‌లో ఇరుక్క‌పోకుండా ఉండ‌టానికి ట్రిక్ ఇదిగో..

వాట్సాప్‌తో ఎన్ని ఉప‌యోగాలున్నాయో అంత చికాకులు కూడా ఉన్నాయి.  స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఈ యాప్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఫ్రెండ్స్‌, స్కూల్ మేట్స్‌, క్లాస్‌మేట్స్‌, గ్లాస్‌మేట్స్‌, కొలీగ్స్‌, ఫ్యామిలీ గ్రూప్స్ ఇలా ఎక్కువ మందితో మ‌నం ట‌చ్‌లో ఉండ‌టానికి కూడా ఈ వాట్సాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మ‌న‌కు ఇష్టం లేని, మ‌న‌కు అంత‌గా అవ‌స‌రం లేని గ్రూప్స్‌లో కూడా మ‌న ఫ్రెండ్సో, ఫ్యామిలీ వాళ్లో, కొలీగ్సో మ‌న‌ల్ని జాయ‌న్ చేస్తుంటారు.   దానిలో వ‌చ్చే మెసేజ్‌లు మీకు చికాకు తెప్పిస్తుంటాయి. మీరు ఎగ్జిట్ అయితే అవ‌త‌లివాళ్లు ఫీల‌వుతారేమోన‌ని ఆలోచిస్తుంటారు. ఇలాంటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారమే గ్రూప్‌లో మిమ్మ‌ల్ని జాయిన్ చేయాలంటే మీ ప‌ర్మిష‌న్ తీసుకునేలా మీ వాట్సాప్‌లో సెట్టింగ్ మార్చుకోవ‌డ‌మే. అది ఎలా ప‌ని చేస్తుందో చూడండి.  
 
* మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.  పైన కుడివైపు కార్నర్‌లో ఉన్న  త్రీడాట్స్  మెనూను క్లిక్ చేయండి. 
* Settings ఓపెన్ చేసి, Account పైన క్లిక్ చేయండి. ఇప్పుడు  Privacyలోకి వెళ్లండి.  దానిలో క‌నిపించే  Groups ఆప్షన్ కూడా క్లిక్ చేయండి.  
* గ్రూప్స్ ఆప్ష‌న్‌లోకి వెళ్లాక  Everyone, My Contacts, My contacts except, Nobody అనే ఆప్షన్స్ క‌నిపిస్తాయి.  అందులో Everyone సెలెక్ట్ చేస్తే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయొచ్చు. My Contacts సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లు మాత్రమే మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయొచ్చు.  
* My contacts except సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్స్‌లో కొందరు మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయకుండా అడ్డుకోవచ్చు. ఎవ‌రు మిమ్మ‌ల్ని గ్రూప్‌లో యాడ్ చేయ‌కూడ‌దు అనుకుంటున్నారో వారి  కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తే ఆ వ్య‌క్తి మిమ్మ‌ల్ని ఏ గ్రూప్‌లోనూ యాడ్ చేయ‌లేరు. 
*  Nobody ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని గ్రూప్‌లో ఎవరూ యాడ్ చేయలేరు.  

లింక్ వ‌స్తుంది.. లైట్ తీసుకోండి
మీకు తెలియకుండా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినా గ్రూప్ ఇన్విటేషన్ లింక్ వస్తుంది. మీకు న‌చ్చితే ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్‌లో జాయిన్ అవ్వ‌చ్చు.  అక్క‌ర్లేదు అనుకుంటే ఆ లింక్‌ను అలాగే వదిలేయండి.  మూడు రోజుల్లో లింక్ ఆటోమేటిగ్గా ఎక్స్‌పైర్ అయిపోతోంది.   ఏదైనా గ్రూప్‌లో మీరు చేరాలనుకుంటే  ఆ గ్రూప్‌ అడ్మిన్‌కు మీ నెంబర్ యాడ్ చేయమని చెప్పండి. మీకు గ్రూప్ ఇన్విటేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ మూడు రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఆ గ్రూప్‌లో యాడ్ అవుతారు.

జన రంజకమైన వార్తలు