గూగుల్ ప్లేస్టోర్‌లో కొన్నివేల యాప్‌లు ఉంటాయి. వీటిలో చాలా వరకు ఫ్రీ యాప్స్ ఉన్నా పెయిడ్ యాప్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. బాగా ట్రెండింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లు ఎక్కువగా పెయిడ్ సెక్షన్‌లో ఉంటాయి. వీటిని కూడా ఫ్రీగా పొందేందుకు చాలా చిట్కాలున్నాయి. అది కూడా లీగల్‌గా పొందవచ్చు. అవేమిటో చూడండి.
1. యాప్ ఆఫ్ ది డే
ఇదొక యాప్. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టా్ చేసుకుంటే రోజూ ఒక పెయిడ్ యాప్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2. గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ యాప్
ప్లే స్టోర్‌లో గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ యాప్ ఉంటుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే వారానికోసారి ఓసర్వే చేస్తుంది. మీరు కొన్ని సింపుల్ క్వశ్చన్స్‌కు ఆన్సర్లు చెబితే మీకు క్రెడిట్ వస్తుంది. దీంతో మీరు పెయిడ్ యాప్స్ , గేమ్స్‌ను ప్లే స్టోర్ నుంచి ఉచితంగా పొందవచ్చు.
3. ఫ్రీ యాప్- ఫ్రీయాప్స్ డైలీ
పెయిడ్ యాప్స్‌ను ఫ్రీగా అందించే మరో యాప్ ఇది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్రతి రోజు ఒక ఫ్రీ యాప్‌ను ఇస్తుంది. మిగిలిన పెయిడ్ యాప్‌ల మీద కూడా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.
4. అమెజాన్ అండర్ గ్రౌండ్
అమెజాన్ అండర్ గ్రౌండ్ ప్ర్రోగ్రాం ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున పెయిడ్ యాప్స్‌ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకవోచ్చు. అయితే ఈ ప్రోగ్రాం వాలిడిటీ ఈ నెల 31 వరకు మాత్రమే ఉంది. దీనిద్వారా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వెంటనే చేసుకుంటే మంచిది.
5. ప్లే స్టోర్ సేల్స్
పెయిడ్ యాప్స్‌ను ఫ్రీగా పొందడానికి ఇది మరో గేట్‌వే. దీంతో చాలా ఆండ్రాయిడ్ పెయిడ్ యాప్‌లను ఫ్రీ గా పొందవచ్చు. మిగిలిన పెయిడ్ యాప్‌ల మీద కూడా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.
6. గూగుల్ ఫ్రీ యాప్ ఆఫ్‌ది వీక్
ప్లే స్టోర్‌లో లాస్ట్ ఇయర్ ఈ ఫీచర్‌ను యాడ్ చేశారు. అయితే ఇదింకా టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. అందువల్ల అందరూ దీన్ని యాక్స్‌స్ చేయలేకపోవచ్చు. కానీ దీని ద్వారా కూడా పెయిడ్ యాప్స్ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.