• తాజా వార్తలు

వైపై పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోయారా...ఇలా చిటికెలో తెలుసుకోండి!

వైఫై..దాదాపు ప్ర‌తి ఇంట్లో ఉంటుంది ఇప్పుడు. మ‌న బంధువులో లేక స్నేహితులో వ‌చ్చిన‌ప్పుడు వైఫై పాస్‌వ‌ర్డ్ చెప్పండ‌ని అడుగుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి మ‌నం వైఫై పాస్‌వ‌ర్డ్‌ని మ‌ర్చిపోతుంటాం. అక‌స్మాత్తుగా గుర్తుకు రాదు.  ఫ‌ర్‌గాట్ పాస్‌వ‌ర్డ్ అనే ఆప్ష‌న్ కూడా ఉండ‌దు. అంటే మ‌ళ్లీ వైఫై రోట‌ర్‌ను రీసెట్ చేయ‌క త‌ప్ప‌దు. మ‌రి వైఫై రోట‌ర్‌ను రీసెట్ చేయ‌కుండా పాస్‌వ‌ర్డ్ తెలుసుకోగ‌లిగితే! ఈ ఆలోచ‌న భ‌లే ఉంది క‌దా... కానీ చాలా సుల‌భం అండీ.. చిన్న చిన్న స్టెప్స్ పాటిస్తే చాలు. మీరు మీ పాస్‌వ‌ర్డ్‌ని తిరిగి సంపాదించుకోవ‌చ్చు... అదెలాగో చూద్దాం..

నిజానికి పాస్‌వ‌ర్డ్‌ని క‌నుగొన‌డం కోసం చాలామంది విండోస్ లేదా మాక్‌.. రోట‌ర్ సెట్టింగ్స్ పేజీలోకి వెళ‌తారు. ఎందుకంటే వైపై నెట్‌వ‌ర్క్ ఎక్క‌డో ఒక‌చోట క‌నెక్ట్ అయి ఉంటుంది. అయితే ఏ డివైజ్‌కు వైఫై క‌నెక్ట్ కాక పోయి ఉన్న‌ట్ల‌యితే రోటర్ వెనుక భాగంలో ఉన్న డ‌బ్ల్యూపీఎస్ పుష్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి. లేక‌పోతే ఎథ‌ర్‌నెట్ కేబుల్‌ను క‌నెక్ట్ చేసి వైఫై రోట‌ర్ పేజీని యాక్సెస్ చేసుకోవ‌చ్చు.  మీ పాస్‌వ‌ర్డ్ ఏదైనా.. దాన్ని మార్చుకోవాల‌నుకుంటున్నా.. లేదా అదే ఉప‌యోగించుకోవాల‌నుకుంటున్నా... మొద‌ట సుభంగా పాస్‌వ‌ర్డ్‌ని అయితే క‌నిపెట్టొచ్చు.

విండోస్‌తో వైఫై క‌నెక్ట్ అయిన‌ప్పుడు
1.విండోస్ వైఫై ఆప్ష‌న్ మీద రైట్ క్లిక్ చేసి టాస్క్ బార్ ఓపెన్ చేయాలి

2. ఓపెన్ నెట్‌వ‌ర్క్ షేరింగ్ సెంట‌ర్ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేయాలి

3. ఆ త‌ర్వాత  ఛేంజ్ అడాప్ట‌ర్ సెట్టింగ్స్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి

4. ఆ పై వైపై ఆప్ష‌న్ మీద డ‌బుల్ క్లిక్ చేయాలి

5. వైపై స్టేట‌స్ పేజీ మీద వైర్‌లెస్ ప్రొప‌ర్టీస్ మీద క్లిక్ చేయాలి

6. త‌ర్వాత సెక్యూరిటీ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. షో పాస్‌వ‌ర్డ్ మీద క్లిక్ చేస్తే చాలు మీరు పెట్టుకున్న పాస్‌వ‌ర్డ్ తెలిపిపోతుంది. 

మెకంతోష్‌తో వైఫై క‌నెక్ట్ అయిన‌ప్పుడు ఓపెన్ నెట్‌వ‌ర్క్ ప్రిప‌రెన్స్ మీద క్లిక్ చేసి.. షో పాస్‌వ‌ర్డ్ మీద క్లిక్ చేస్తే స‌రిపోతుంది. 

జన రంజకమైన వార్తలు