ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లపై సెక్యూరిటీ పరమైన అనేక దాడులు చోటుచేసు కుంటున్నాయి. ఈ క్రమంలో మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను సెక్యూరిటీ, మాల్వేర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు పలు చిట్కాలు పాటించాలి.
ఇవి పాటిస్తే..
- ఆండ్రాయిడ్ డివైస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా ఉంచండి. ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తయిన ప్రతిసారీ సైన్ అవుట్ చేయటం మరవద్దు.
- మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో అనధికారిక యాప్‌లను ఇన్స్‌స్టాల్ చేసేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి
- వ్యక్తిగత సమచారాన్ని ఫోన్‌లోని ఎస్‌డీ కార్డులలో స్టోర్ చేయటం మంచిది కాదు.
- ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సహకరిస్తుంది. ఈ కారణంగా మీ ఫోన్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ కారణంగా ప్రాసెసర్ పనితీరు మందగి స్తుంది. ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను హ్యాండ్‌సెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకున్నట్లయితే వైరస్ బెడద తప్పుతుంది.
- స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయా శంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.
- మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మరింత బలోపేతమవుతాయి
- ఆఫీస్ కార్యాకలాపాలకు మీ వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే ముందు పటిష్టమైన సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఇందక ఐటీ ప్రొఫెషనల్స్ సలహాలను తీసుకోండి.
- మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ముఖ్యమైన సమచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయకుండా ఆ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసుకున్నట్లయితే ఓ నిర్దేశిత పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఆ డేటాను ఓపెన్ చేసిన ప్రతిసారీ డిక్రిప్ట్ అయి మీకు కనబు డుతుంది. ఈ ప్రోగ్రామ్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డేటాకు పూర్తి భద్రతనిస్తుంది.
- ఆండ్రాయిడ్ డివైస్‌కు స్క్రీన్‌లాక్ తప్పనిసరి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఏర్పాటు చేసుకున్న స్క్రీన్ లాక్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాథమిక రక్షణగా నిలుస్తుంది.