• తాజా వార్తలు

ఈ గూగుల్ ఫోన్ యాప్ ట్రిక్స్‌తో వండ‌ర్స్ చేయ‌చ్చు తెలుసా?

స్మార్ట్ ఫోన్ వ‌ల్ల ఏంటి ఉప‌యోగం? ఈ ప్ర‌శ్న వేస్తే చాలామంది నుంచి వ‌చ్చే స‌మాధానం ఇంట‌ర్నెట్ యూజ్ చేయ‌డం అని! కానీ నిజానికి ఫోన్ వ‌ల్ల ప్ర‌ధాన ఉప‌యోగం కాల్స్ చేయ‌డం, మెసేజ్‌లు చేయ‌డ‌మే క‌దా.. ఈ ప్ర‌ధాన అంశాన్ని మ‌నం ఎక్కువ‌గా ప‌ట్టించుకోం. ఎందులో పెద్ద కెమెరా ఉంది... ఏ ఫోన్లో నెట్ బాగా వ‌స్తుంద‌నే చూసుకుంటాం. అయితే మ‌నం స్మార్ట్‌ఫోన్లో యాప్స్ ఎక్కువ‌గా వాడ‌తాం.. ఆ కోవ‌లోనే ఒక ఫోన్ యాప్ వ‌చ్చింది.. దాని పేరూ గూగుల్ ఫోన్ యాప్‌ మ‌రి ఈ గూగుల్ ఫోన్ యాప్ ద్వారా చాలా  వండ‌ర్స్ చేయ‌చ్చు అదేంటో చూద్దాం..

కాపీ నంబ‌ర్‌
మ‌నం ఫోన్లో ఏదైనా టెక్ట్‌ను సెలెక్ట్ చేస్తే దాన్ని కాపీ చేసుకోవ‌చ్చ‌ని తెలుసు. ఆ టెక్ట్ నంబ‌ర్‌, ఐడీ ఏదైనా కావొచ్చు. ఇలా చేయాలంటే ముందుగా ఆ టెక్ట్‌ని లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే చాలు.. అది మీ క్లిప్‌బోర్డ్‌కి కాపీ అయిపోతుంది. కీబోర్డ్ ఓపెన్‌గా ఉన్న‌ప్పుడు కూడా ఇది ప‌ని చేస్తుంది. రీసెంట్ స్క్రీన్స్ నుంచి కూడా మీరు నంబ‌ర్ల‌ను కాపీ చేసుకోవ‌చ్చు. 

ఎడిట్ నంబ‌ర్ బిఫోర్ డ‌యిలింగ్
మ‌నం ఫోన్ చేసేట‌ప్పుడు నంబ‌ర్ త‌ప్పు కొడితే ఏం చేస్తాం.. మ‌ళ్లీ నంబ‌ర్ డ‌యిల్ చేస్తాం. అయితే  ఆ నంబ‌ర్‌ని ఎడిట్ చేసి డ‌యిల్ చేసుకునే స‌దుపాయం ఉంటే మ‌న ప‌ని ఇంకా సుల‌భం అవుతుంది క‌దా! గూగుల్ యాప్స్‌లో మ‌న‌కు ఈ సదుపాయం కూడా ఉంది. ఆ నంబ‌ర్ మీద ట్యాప్ చేయ‌డం ద్వారా మీరు డ‌యిల్ చేసిన నంబ‌ర్‌ని ఎడిట్ చేసుకోవ‌చ్చు. 

మినిమైజ్ కాల్‌
మీరు ఒక కాల్‌లో ఉన్న‌ప్పుడు హోమ్ బ‌ట‌న్‌ని ప్రెస్ చేస్తే మీ కాల్ డిస్ క‌నెక్ట్ కాకుండానే ఫోన్‌లో ఇత‌ర స‌దుపాయాల‌ను వాడుకోవ‌చ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో కాలింగ్ ఇంట‌ర్ ఫేస్ మినిమైజ్ అవుతుంది. ఇది ఫ్లోటింగ్ బ‌బుల్ మాదిరిగా మ‌న‌కు క‌నిపిస్తుంది. ఈ బ‌బుల్‌ను మ‌న‌కు న‌చ్చిన ప్లేస్‌కు మూవ్ చేసుకోవ‌చ్చు. 

ఫైండ్ నియ‌ర్ బై ప్లేసెస్‌
గూగుల్ ఫోన్ యాప్‌ ద్వారా టినీ గూగుల్ సెర్చ్ చేసుకోవ‌చ్చు. అంటే మీరు కాంటాక్ట్ డిటైల్స్ సెర్చ్ చేసుకోవ‌చ్చు. మీ లొకేష‌న్‌కు ద‌గ్గ‌ర‌లోని ప్లేస్‌ల‌ను వెతుక్కోవ‌చ్చు. ఇందుకోసం మీరు సెర్చ్ బాక్స్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన బిజినెస్ నేమ్‌ని టైప్ చేయాల్సి ఉంటుంది. 

కాల్ హిస్ట‌రీ వ్యూ
మీ ఫోన్‌లో కాల్ చేసిన నంబ‌ర్ల‌కు సంబంధించిన హిస్ట‌రీని కూడా మీరు తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం ఆ కాంటాక్ట్ పేరు మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత హిస్ట‌రీ బ‌ట‌న్ ప్రెస్ చేయాలి. ఇలా చేయ‌డం ద్వారా మీరు ఏ సమయంలో ఎప్పుడు ఎంత‌సేపు ఆ నంబ‌ర్‌కి కాల్ చేశారో వివ‌రాలు తెలిసిపోతాయి. 

జన రంజకమైన వార్తలు