• తాజా వార్తలు

వాట్స‌ప్ కాల్స్ నాట్ వ‌ర్కింగ్.. స‌మ‌స్య వేధిస్తుందా? ఇవిగో ప‌రిష్కారాలు! (పార్ట్‌-2)

వాట్స‌ప్ కాల్స్ నాట్ వ‌ర్కింగ్... ఈ స‌మ‌స్య ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొనేదే. ఎందుకంటే స‌రైన ఇంట‌ర్నెట్ లేక‌పోవ‌డం, డేటా అయిపోవడం లాంటి ఇబ్బందుల వ‌ల్ల సాధార‌ణంగా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.  మ‌రి ఆ ప‌రిష్కారాలు ఏమిటో తెలుసుకుందామా..

ట‌ర్న్ ఆఫ్ బ్లూటూత్
ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో బ్లూటూత్ వాడ‌కం చాలా సాధార‌ణ విష‌యం. అయితే వాట్స‌ప్ కాల్స్‌ను అడ్డుకోవ‌డంలో బ్లూ టూత్ పాత్ర కూడా ఉంటుంద‌న్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. ముఖ్యంగా మీ ద‌గ్గ‌ర వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్ ఉన్న‌ప్పుడు, స్పీక‌ర్ క‌నెక్ట్ కాన‌ప్పుడు బ్లూటూత్.. వాట్స‌ప్ కాల్స్ నిరోధ‌కంగా ప‌ని చే్స్తుంది. ఈ ప‌రిస్థితితో వెంట‌నే బ్లూటూత్‌ని ట‌ర్న్ ఆఫ్ చేయ‌డం చాలా ముఖ్యం.  దీని వ‌ల్ల మ‌నం నిరాటంకంగా ఫోన్ కాల్ మాట్లాడుకునే అవ‌కాశం ఉంటుంది.

గ్రాంట్ నెస‌స‌రీ ప‌ర్మిష‌న్స్‌
వాట్స‌ప్ యూజ్ చేయాలంటే ఆండ్రాయిడ్ కానీ ఐవోఎస్ కానీ కొన్ని పర్మిష‌న్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వ‌క‌పోతే కాల్స్ స‌రిగా మాట్లాడే అవ‌కాశం ఉండ‌దు. కాల్స్ స‌రిగా మాట్లాడాలంటే ముందుగా మైక్రోఫోన్  ప‌ర్మిష‌న్ ఇవ్వాలి. అందుకే కాల్స్ ఏమైనా డిస్ట‌ర్బ్ అవుతుంటే ఈ పర్మిష‌న్లు అన్నీ స‌రిగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి.  వీడియో కాల్స్ కోసం వీడియో ప‌ర్మిష‌న్స్‌ను అనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఐఫోన్లో అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి మైక్రోఫోన్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఇది ఆఫ్‌లో ఉంటే వెంట‌నే అనేబుల్ చేయాలి.

డిజేబుల్ డేటా  సేవ‌ర్ మోడ్
ప్ర‌తి ఫోన్లోనూ డేటా సేవ‌ర్ మోడ్ చాలా కీల‌క‌మైన ఆప్స‌న్‌.  త‌క్కువ డేటాను కంజ్యూమ్ చేసేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. వాట్స‌ప్ లాంటి ఫీచ‌ర్ల‌ను కూడా ఇది ఒక్కోసారి బ్లాక్ చేస్తుంది. ఇలాంట‌ప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఫోన్ల‌లో డేటా సేవ‌ర్ లేదా డేటా మోడ్‌ని డిజేబుల్ చేయాలి. ఇందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెర్చ్‌లో డేటా సేవ‌ర్ మోడ్ అని సెర్చ్ చేయాలి. ఆ త‌ర్వాత ట‌ర్న్ ఆఫ్ చేయాలి.

చెక్ రిస్ట్రిక్ష‌న్స్ ఆన్ వాట్స‌ప్‌
ఈ ఆప్ష‌న్ ఐఫోన్ల‌లోనే ఉంటుంది. ఏమైనా రిస్ట్రిక్ష‌న్స్ ఉంటే వాట్స‌ప్ స‌క్ర‌మంగా ప‌ని చేయ‌దు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్క్రీన్ టైమ్ అనే ఆప్ష‌న్ మీద ట్యాప్ చేయాలి. ఆ త‌ర్వాత కంటెంట్ ప్రైవ‌సీ రిస్ట్రిక్ష‌న్స్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఆపై మైక్రోఫోన్ మీద ట్యాప్ చేయాలి. వాట్స‌ప్ ప‌క్క‌న ఉండే ట్యాగ‌ల్ గ్రీన్ క‌ల‌ర్‌లో ఉండాలి. ఒక‌వేళ లేక‌పోతే అలౌ ఛేంజెస్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేసిట ట్యాగిల్‌ను టర్న్ ఆన్ చేయాలి.

ఛేంజ్ లో డేటా యూసేజ్ సెట్టింగ్‌
లోయ‌ర్ డేటా యూసేజ్ కోసం వాట్స‌ప్ నేటివ్ సెట్టింగ్ ఆప్ష‌న్ ఇస్తుంది. మీరు అనేబుల్ లేదా డిజేబుల్ చేయ‌డం ద్వారా ప్లాబ్ర‌మ్స్ ఫిక్స్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం వాట్స‌ప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత లో డేటా యూసేజ్ ద‌గ్గ‌ర ఉండే ట్యాగిల్ ట‌ర్న్ ఆఫ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి.  

జన రంజకమైన వార్తలు