• తాజా వార్తలు

వాట్స‌ప్ కాల్స్ నాట్ వ‌ర్కింగ్.. స‌మ‌స్య వేధిస్తుందా? ఇవిగో ప‌రిష్కారాలు! (పార్ట్‌-4)

వాట్స‌ప్ కాల్స్ నాట్ వ‌ర్కింగ్... ఈ స‌మ‌స్య ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొనేదే. ఎందుకంటే స‌రైన ఇంట‌ర్నెట్ లేక‌పోవ‌డం, డేటా అయిపోవడం లాంటి ఇబ్బందుల వ‌ల్ల సాధార‌ణంగా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.  మ‌రి ఆ ప‌రిష్కారాలు ఏమిటో తెలుసుకుందామా..

రీసెట్ యాప్ ప్రిఫ‌రెన్సెస్‌
ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్‌కు ప్రిఫెరెన్సెస్ ఇస్తుంటాం. వీటి వ‌ల్ల కూడా మ‌న వాట్స‌ప్ కాలింగ్, మెసేజింగ్ స‌మస్య‌లు ఎదురువుతాయి ఇలాంట‌ప్పుడు యాప్ ప్రిఫెరె్న్సెస్‌ను రీసెట్టింగ్ చేయాలి. ఇది నెట్‌వ‌ర్క్ రీసెట్టింగ్ చేయ‌డం లాంటిదే. దీని వ‌ల్ల మ‌న డేటా డిలీట్ కాదు.  కానీ మీ ఫోన్లో సెట్టింగ్స్‌ను ఇది ఒరిజిన‌ల్‌గా రీస్టోర్ చేస్తుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి రీసెట్ మీద క్లిక్ చేసి రీసెట్ యాప్ ప్రిఫెరెన్సెస్ మీద ట్యాప్ చేయాలి.

చెక్ థ‌ర్డ్ పార్టీ యాప్స్ 
తాజాగా ఏమైనా థ‌ర్డ్ పార్టీ యాప్‌లు డౌన్‌లోడ్ చేశారా? ఇందులో ఏదైనా కాలింగ్‌, వీపీఎన్ యాప్‌లు ఉన్నాయా.. అయితే మీరు త‌ప్ప‌కుండా వాటిని మ‌ళ్లీ పున‌ర్ స‌మీక్షించాలి. వీటి వ‌ల్ల కూడా మీ వాట్స‌ప్ కాలింగ్‌కు అంత‌రాయం క‌లిగే అవ‌కాశం ఉంది. ప్రి ఇన్‌స్టాల్డ్ యాప్స్‌లో క్యాచెను క్లియ‌ర్ చేయాలి. ప‌ర్మిష‌న్ల‌ను చెక్ చేయాలి.

అప్‌డేట్ వాట్స‌ప్‌
వాట్స‌ప్ కాలింగ్ లేదా మెసేజింగ్ స‌ర్వీసులు స‌రిగా ప‌ని చేయ‌క‌పోతే వాటికి అప్‌డేష‌న్ కూడా కార‌ణం కావొచ్చు. అందుకే లేటెస్ట్ వెర్ష‌న్ అప్‌డేష‌న్‌తో వాట్స‌ప్ వాడ‌డం ముఖ్యం.  ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్ ప్లే మీద క్లిక్ చేసి ప్లేస్టోర్‌లోకి వెళ్లి వాట్స‌ప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే అదే ఫిక్స్ చేస్తుంది.

రీసెట్ నెట్‌వ‌ర్క్ సెట్టింగ్స్‌
ఆండ్రాయిడ్‌, ఐఫోన్ల‌లో నాటివ్ సెట్టింగ్స్ ఇంపార్టెంట్‌. మీ నెట్‌వ‌ర్క్ రిలేటెడ్ ఇష్యూల‌ను ఫిక్స్ చేయ‌డం కోసం నెట్‌వ‌ర్క్ సెట్టింగ్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మీరు వాట్స‌ప్‌లో కాలింగ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్పుడు రీసెట్టింగ్ నెట్‌వ‌ర్క్ సెట్టింగ్ మీ ఫోన్లో ఎలాంటి డేటాను డిలీట్ చేయ‌దు. ఇందుకోసం మీరు రీసెట్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేసి రీసెట్ వైఫై క్లిక్ చేయాలి. సెర్చ్‌బార్ ద్వారా రీసెట్ సెట్టింగ్స్‌ను క‌నుగొనే అవ‌కాశం ఉంది.

రీఇనిస్టాల్ వాట్స‌ప్ 
వాట్స‌ప్‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం కోసం రీఇనిస్టాల్ చేయ‌డం కూడా ప‌రిష్కారం. ఇందుకోసం ముందుగా మీ వాట్స‌ప్ డేటాను బ్యాక్ అప్ చేసుకోవాలి. లేక‌పోతే ఇది మొత్తం డేటాను ఎరేజ్ చేస్తుంది. ఒక‌సారి అన్ఇన్ స్టాల్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ తిరిగి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పుడు గ‌తంలో ఉన్న స‌మ‌స్య‌లు మ‌ళ్లీ రావు. 

రీప్లేస్ మైక్రోఫోన్‌
అన్నిటిక‌న్నా ముఖ్య‌మైంది మైక్రోఫోన్‌ను రీప్లేస్ చేసుకోవ‌డం. ఇటీవ‌లే కాలంలో మీరు ఫోన్ డిస్‌ప్లే క‌నుక ఛేంజ్ చేసిన‌ట్ల‌యితే అది మైక్రోఫోన్ మీద ప్ర‌భావం చూపిస్తుంది. ఇది బాగుప‌డాలంటే మ‌ళ్లీ తిరిగి మైక్రోఫోన్‌ను రీప్లేస్ చేయ‌డం ఒక్క‌టే మార్గం. 

జన రంజకమైన వార్తలు