• తాజా వార్తలు

గూగుల్ క్రోమ్ క‌స్ట‌మైజేష‌న్ ట్రిక్స్  పార్ట్‌ 1- బోరింగ్ థీమ్‌కి బైబై చెప్పండి 

గుల్ క్రోమ్‌.. బ్రౌజ‌ర్ల‌లో తిరుగులేనిది. కానీ ఎప్పుడూ అదే బోరింగ్ థీమ్‌. చూడ‌టానికి కూడా విసుగొస్తుందా? అయితే మీకు న‌చ్చిన‌ట్లుగా క్రోమ్ బ్రౌజ‌ర్‌ను కావాల్సిన‌ట్లుగా క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు.  ఆ క‌స్ట‌మైజేష‌న్‌పై రోజుకో ర‌కం ఆసక్తిక‌ర‌మైన ఆర్టిక‌ల్ మీకోసం..   ఈ ఫ‌స్ట్ ఆర్టిక‌ల్‌లో మీ విండోస్ పీసీ, మ్యాక్‌ల్లో గూగుల్ క్రోమ్‌ను క‌స్ట‌మైజ్ చేసుకుని క‌ల‌ర్‌ఫుల్‌గా మార్చుకోవ‌‌డం ఎలాగో చూడండి. 

థీమ్స్ వాడండి
గూగుల్ త‌న క్రోమ్ బ్రౌజ‌ర్‌ను చేంజ్ చేసుకోవ‌డానికి 2019 ఫిబ్ర‌వ‌రిలో 14 థీమ్స్ లాంచ్ చేసింది. 

1. మీ పీసీ లేదా మ్యాక్‌లో క్రోమ్‌ను ఓపెన్ చేయండి. 

2. బ్రౌజ‌ర్‌లో టాప్‌లో కుడివైపున ఉన్న మూడు డాట్స్‌ను క్లిక్ చేయండి. 

3. ఇప్పుడు సెట్టింగ్స్‌ను టాప్ చేయండి. 

4. అప్పియ‌రెన్స్ కింద ఉన్న థీమ్స్‌ను క్లిక్ చేయండి. ఇది మిమ్మ‌ల్ని నేరుగా క్రోమ్ స్టోర్స్‌లోకి తీసుకెళుతుంది. 

5. అక్క‌డ మీకు న‌చ్చిన థీమ్‌ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్క్రీన్‌లో యాడ్ టు క్రోమ్‌ను క్లిక్ చేయండి.  అంతే మీ క్రోమ్ థీమ్ మారిపోతుంది. 

పాత లుక్ మ‌ళ్లీ కావాలా? 
 మీరు మ‌ళ్లీ డిఫాల్ట్ క్రోమ్ బ్రౌజ‌ర్ లుక్ తెచ్చుకోవాల‌నుకున్నా ఓకే. దీనికోసం క్రోమ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి థీమ్స్‌లో ఉన్న Reset to defaultను క్లిక్ చేస్తే బ్రౌజ‌ర్‌ డిఫాల్ట్ లుక్ వ‌చ్చేస్తుంది.  

జన రంజకమైన వార్తలు