• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ లో ప్రి-ఇన్ స్టాల్డ్ యాప్స్ ని తొలగించదానికి తిరుగులేని ట్రిక్స్ మీకోసం

ఫోన్లలో ఎక్కువుగా వినియోగించబడుతోన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఓపెన్ సోర్స్ కావటంతో అనేక సెక్యూరిటీ ప్రమాదాలు పొంచి ఉన్నాయని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా Bloatware యాప్స్ నుంచి ఆండ్రాయిడ్ డివైస్‌లకు ముప్పు వాటిల్లే ప్రమాదాం ఎక్కువుగా ఉందని వీరు చెబుతున్నారు. Bloatware యాప్స్ అనేవి ముందుగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందుపరచబడిన Pre-Installed Apps. ఈ యాప్స్ ద్వారా ఆండ్రాయిడ్ హ్యాకర్లు ఫోన్‌లలోకి చొరబడి విధ్వంసం సృష్టించే వీలుంటుంది. మరి వీటిని తొలగించడం ఎలాగో తెలుసుకుందాం.

ఫోన్‌లో ముందుగానే నిక్షిప్తమై ఉన్న కొన్ని స్టాక్ యాప్స్‌‌ను మీరు మాన్యువల్‌గా రిమూవ్ చేయటం సాధ్యపడదు. కాబట్టి, ముందుగా ఫోన్‌లోని developer optionను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్ Settings -> About Phone -> Build Number పై 7 నుంచి 10 సార్లు టాప్ చేయటం ద్వారా developer option ఎనేబుల్ అవుతుంది.

ఇప్పుడు మరోసారి ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే developer option కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్‌ ఓపెన్ చేసినట్లయితే, మీకు USB Debugging పేరుతో మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఎనేబుల్ చేసుకోండి.

ఇప్పుడు మీ విండోస్ పీసీలో Debloater టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ టూల్ మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని సిస్టం యాప్స్‌ను రిమూవ్ చేయగలదు.

యూఎస్బీ కేబుల్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను పీసీకి కనెక్ట్ చేయండి. Debloater టూల్ మీ డివైస్‌ను డిటెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయండి.

డివైస్ డిటెక్ట్ అయిన వెంటనే మీ ఫోన్‌లోని యాప్స్ మొత్తం స్కాన్ కాబడతాయి. వాటిలో Pre-Installed Appsను మార్క్ చేసుకుని apply బటన్ పై క్లిక్ చేసినట్లయితే అవి రిమూవ్ కాబడతాయి.

Rooted ఆండ్రాయిడ్ ఫోన్‌లో Bloatware యాప్స్‌ను తొలగించేందుకు ఈ క్రింది మార్గాలను అనుసరించండి..

Rooted ఆండ్రాయిడ్ ఫోన్‌లో
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ root కాబడినదై ఉండాలి.ఆ తరువాత System App Remover అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి.డౌన్‌లోడ్ అయిన System App Remover యాప్‌ను ఫోన్ లో లాంచ్ చేయండి.యాప్ లాంచ్ అయిన తరువాత మీరు రిమూవ్ చేయాలనుకుంటున్న యాప్ ను సెలక్ట్ చేసుకుని ‘Uninstall' పై టాప్ చేయండి. ఈ విధంగా రూట్ కాబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌లో Bloatware యాప్స్‌ను తొలగించవచ్చు.
 

జన రంజకమైన వార్తలు