మీ మెమొరీ కార్డు పని చేయడం లేదా. అది పాడైపోయిందా.. అయితే మీరు ఏమి టెన్సన్ పడనవసరం లేదు. మీ విండోస్ కంప్యూటర్‌లో కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా మీ మెమరీ కార్డ్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
ముందుగా మీ ఫోన్‌లోని డేటా స్టోరేజ్ కార్డ్‌ను మెమరీ కార్డ్ రీడర్ సహాయంతో కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.
కార్డ్ రీడర్ పీసీకి కనెక్ట్ అయిన తరువాత స్టార్ట్ మెనూలోని కంప్యూటర్స్‌లోకి వెళ్లి మీ మెమరీ కార్డ్ ఏ రిమూవబుల్ డిస్క్ క్రింద లిస్ట్ అయ్యిందో చూడండి. ఉదాహరణకు: Removable Disk (M:), Removable Disk (H:). డ్రైవర్ లెటర్‌ను గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు మీ కంప్యూటర్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి. మీ పీసీలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవ్వాలంటే. కీబోర్డ్ లోని (win +R) షార్ట్ కట్ ను ప్రెస్ చేసినట్లయితే Run డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. రన్ డైలాగ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ok బటన్ పై క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది.
కమాండ్ ప్రాంప్ట్‌లో chkdsk m: /r, అని టైప్ చేయండి. ఇక్కడ ‘m' అక్షరం డ్రైవ్ లెటర్. మీ డ్రైవ్ ఏ లెటర్‌లో ఉంటే లెటర్‌ను ‘m' స్థానంలో రీప్లేస్ చేసి ఎంటర్‌ను ప్రెస్ చేసినట్లయితే మెమరీ కార్డ్‌లోని ఎర్రర్‌లను విండోస్ గుర్తించి వాటిని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంది.
వైరస్ ఇంకా మాల్వేర్ల కారణంగా పలు సందర్భాల్లో డేటాతో నిండి ఉన్న మెమరీ కార్డ్‌లు కరప్ట్ అవుతుంటాయి. డేటా కరప్ట్ అయిన మెమరీ కార్డ్‌లలో మెమరీ అసలు కనిపించదు. ఇటువంటి పరిస్థితుల్లో కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేసేందుకు శక్తివంతమైన డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ అవసరమవుతుంది.
ఆన్‌లైన్‌లో అనేక డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకుని మీ పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. కార్డ్ రీడర్ సహాయంతో మీ మెమరీ కార్డ్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. ఆ తరువాత డేటా రికవరీ ప్రోగ్రామ్‌ను రన్ చేయటం ద్వారా మీ మెమరీ కార్డ్‌లోని డేటాను రికవర్ చేసుకోవచ్చు.