• తాజా వార్తలు

ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్ లేని వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్ అలాగే వాట్సప్ ఉండి తీరాల్సిందే. అయితే ఫేస్‌బుక్ ఉంది కదా అని దానిలో 24 గంటలు గడిపేస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి దాన్ని ఓపెన్ చేస్తుంటారు. దీంతో మీ డేటా అయిపోతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అది కంట్రోల్ కాదు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు కొన్ని ఉత్తమమైన మార్గాలను ఫేస్‌బుక్ అందిస్తోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ స్వయంగా తమ యూజర్ల డేటా సేవింగ్ కోసం టిప్ప్ చెబుతోంది. మీ ఫేస్ బుక్ అకౌంట్లో Settings ఒకసారి Changes చేస్తే చాలు.. మొబైల్ డేటా సేవ్ చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం. 

ఇకపై మీరు రోజుకు ఎన్నిసార్లు ఫేస్‌బుక్ అకౌంట్ చూస్తుంటారు అనే విషయాన్ని మీ స్మార్ట్ ఫోన్‌కు వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒక రోజులో ఎంత సమయం మీరు ఫేస్ బుక్ News Feedపై కనిపించే వీడియోలు, ఫొటోలను వీక్షిస్తున్నారు. అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. 

ఫేస్‌బుక్ సెట్టింగ్స్ ఛేంజ్ చేయండిలా :
స్మార్ట్ ఫోన్ ద్వారా క్వాలిటీ ఫొటోలు, వీడియోలను అకౌంట్లో అప్‌లోడ్ చేయొద్దు, ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ పై ప్లే అయ్యే వీడియోలను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది.
మీ స్మార్ట్ ఫోన్‌లో Facebook App ఓపెన్ చేయండి. లెఫ్ట్ కార్నర్ కింది భాగంలో hamburger icon మీద tap చేయండి (ఐఫోన్ యూజర్లు). Settings ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇందులో Privacy ఆప్షన్ పై క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయండి.. media, contacts ఆప్షన్ కు వెళ్లండి. ఇక్కడ.. Videos, Photos ఆప్షన్ పై Type చేయండి. న్యూస్ ఫీడ్‌లో Videos పై సౌండ్ బటన్ పై ఆన్ చేయండి. వీడియో సెట్టింగ్స్‌ కింద Upload HD బటన్ పై క్లిక్ చేయండి. ఫొటో సెట్టింగ్స్ కింద  Upload HD ఆప్షన్ పై క్లిక్ చేయండి. Auto Play ఆప్షన్ ఓపెన్ చేయండి. Wi-Fi కనెక్షన్ మాత్రమే సెలెక్ట్ చేయండి. Never ఆటో ప్లే Videos ఆప్షన్ పై క్లిక్ చేయండి. 

Data Saver ఆప్షన్ కోసం :
ఫేస్ బుక్ తమ యూజర్లకు డేటా సేవర్ ఆప్షన్ ఆఫర్ చేస్తోంది. ఇమేజ్ సైజు తగ్గించడమే కాకుండా ఆటో ప్లే వీడియో ఆప్షన్ కూడా disable చేయవచ్చు. ఈ ఆప్షన్ యాక్సస్ చేయాలంటే ఇలా చేయండి. hamburger icon (==) పై Tap చేయండి. Settings & Privacy ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడే Data Saver ఆప్షన్ ఉంటుంది. ఇది ఎనేబుల్ చేయండి చాలు.. మీ డేటా సేవ్ అవుతుంది.

మరోవైపు ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జూన్ 2019లో 1.59 బిలియన్ల మంది డెయిలీ యాక్టివ్ యూజర్లు పెరగగా.. జూన్ 30, 2019 నాటికి నెలవారీ యాక్టివ్ యూజర్లు 2.41 బిలియన్ల మంది ఉన్నారు. 

జన రంజకమైన వార్తలు