• తాజా వార్తలు

ఏకంగా ఐఫోనే తయారుచేసేశాడు..


యాపిల్ ఐఫోన్ తయారీ అంటే దానికి ఎంతో సెటప్ కావాలి. కానీ... ఓ సాధారణ వ్యక్తి ఐఫోన్ స్పేర్ పార్ట్స్ ను అసెంబుల్ చేసి ఏకంగా ఐఫోన్ తయారుచేసేశాడు. ఆ విధానమంతా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఇదిప్పుడు వైరల్ గా మారింది. యూరప్ కు చెందిన ఓ వ్యక్తి చైనా వెళ్లి ఆ దేశంలోని ప్రముఖ స్పేర్ పార్ట్స్ మార్కెట్ అయిన షెన్జెన్ నుంచి ఐఫోన్ విడిభాగాలు కొనుగోలు చేశాడు. వాటితో ఐఫోన్ 6 ఎస్ తయారు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.
మొత్తం వీడియో తీసి..
షెన్జెన్ మార్కెట్ లోని వివిధ షాపుల్లో సేకరించిన స్పేర్ పార్ట్స్ తో సరికొత్త బెస్ట్ సెల్లింగ్ ఐఫోన్ 6ఎస్ 16 జీబీ మొబైల్ ను తయారు చేశాడు. ఈ ఫోన్ స్పేర్స్ కొనుగోలు చేస్తూ, ఒక్కో స్పేర్ అమరుస్తూ తాను ఐఫోన్ 6ఎస్ ను ఎలా రూపొందించాడో చెబుతూ... మొత్తం విధానాన్ని చివరి వరకు వీడియో తీసి దానిని యూట్యూబ్ లోని ‘‘స్ట్రేంజ్ పార్ట్స్ ’’ ఛానల్ లో పెట్టాడు. దీంతో ఇది వైరల్ అయింది. ఆ వీడియోను మీరు కూడా చూడచ్చు...
https://www.youtube.com/watch?v=leFuF-zoVzA

జన రంజకమైన వార్తలు