వాట్సాప్‌లో మనకు ఎవరన్నా మెసేజ్ పంపిస్తే దాన్ని మనం ఓపెన్ చేసి చూడగానే రెండు బ్లూ టిక్ మార్క్స్ సెండర్‌కు కనిపిస్తాయి. అంటే మనం ఆ మెసేజ్ చూసినట్లు వాళ్లకు అర్థమవుతుంది. అయితే ఈ ఫీచర్ అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఆబ్లిగేషన్ మెసేజ్‌లు ఉంటాయి. సెలవు కావాలని బాస్‌కు మెసేజ్ పెడితే ఆయన చూశాడని మీకు అర్ధమైపోతే.. నేను మెసేజ్ పెట్టాను మీరు చూశారు అని అడగొచ్చు. ఇలాంటివే కాదు ఇటీవల కొన్ని కోర్ట్‌లు కూడా సమన్లు వంటివి వాట్సాప్‌లో పంపొచ్చని చెబుతున్నాయి. అంటే బ్లూటిక్ కనిపిస్తే ఆ మెసేజ్‌ను చూశారు కాబట్టి సమన్ అందుకున్నట్లే అని కోర్టు నమ్ముతోంది. ఇలాంటి రకరకాల ఆబ్లిగేషన్ మధ్యలో రీడ్ చేయగానే వచ్చే బ్లూటిక్ మీద చాలా మంది వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాట్సాప్ ఈ బ్లూ టిక్‌ను డిజేబుల్ చేసుకోగల ఫీచర్‌ను తీసుకొచ్చింది. చాలామంది దీన్ని ఇప్పటికే వాడుతున్నారు.
ఎలా సెట్ చేసుకోవాలి?
1. వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.
2. సెట్టింగ్స్‌లోకి వెళ్లి Accountని క్లిక్ చేయండి. వచ్చిన ఆప్షన్లలో నుంచి Privacyని క్లిక్ చేయండి.
3. వచ్చిన ఆప్షన్లలో Read Receiptsని డిజేబుల్ చేయండి.
4. ఇప్పుడు మీరు మెసేజ్ చూసినా కూడా సెండర్‌కు బ్లూటిక్స్ కనపడవు.
అయితే ఈ ఫీచర్ వాడుకోవాలంటే మీ వాట్సాప్ యాప్ WhatsApp 2.11.44 version తర్వాతదై ఉండాలి. కాబట్టి ఒకసారి మీ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయండి.