ఎవరికైనా వాట్సాప్ చేయాలంటే వారి నెంబర్ మన కాంటాక్ట్స్‌లో సేవ్ అయి ఉండాలి. అయితే ప్రతిసారి ఇలా నెంబర్‌ను మాన్యువల్‌గా సేవ్ చేసుకోవడం కష్టం కాకపోయినా కాస్త చిరాకు వ్యవహారమే. అందుకే వాట్సాప్ దీనికో పరిష్కారం కనుక్కొంది. క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేస్తే చాలు కాంటాక్ట్స్ యాడ్ అయిపోయే ఫీచర్‌ను త్వరలోనే తీసుకురాబోతోంది.
ఎలా సేవ్ అవుతుంది?
ప్రస్తుతం కాంటాక్ట్‌ను మన కాంటాక్ట్స్‌లో యాడ్ చేసుకుని ఆ తర్వాతే వాట్సాప్ చేయగలుగుతున్నాం. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. *
* మీరు ఎవరి కాంటాక్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయమనండి.
* ఇప్పుడు వారి ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళితే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
* ఆ క్యూఆర్ కోడ్‌ను మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కానర్‌తో స్కాన్ చేయండి.
* అంతే వారి నెంబర్ మీ కాంటాక్ట్స్‌లో సేవ్ అవుతుంది.
ప్రస్తుతం బీటా యూజర్లకే
ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లోనూ దీన్ని వాడుకోవచ్చు.