• తాజా వార్తలు

ఇకపై ఇండియాలో వాట్సాప్ స్టేటస్ నిడివి 15 సెకన్లే.. ఎందుకో తెలుసా? 

వాట్సాప్ స్టేటస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోని స్టోరీస్ అనే ఫీచర్ ను ఇన్‌స్పిరేషన్ గా  తీసుకుని 
వాట్సాప్‌లో ప్రవేశపెట్టిన స్టేటస్ ఫీచర్ పిచ్చ పాపులర్ అయింది. ౩౦ సెకన్ల లెంగ్త్ ఉండే వీడియోలను దీనిలో పెట్టుకోవచ్చు. ఐతే ఇప్పుడు ఆ నిడివి తగ్గిపోయింది. వాట్సాప్ స్టేటస్ వీడియో లెంగ్త్ 15 సెకన్లకి తగ్గిస్తూ దాని బాస్ ఫేసుబుక్ నిర్ణయం తీసుకుంది.  

క‌రోనా ఎఫెక్టే
కరోనా లాక్ డౌన్ తో ఇండియా అంతా స్తంభించిపోయింది. ఇంట్లో ఖాళీగా కూర్చున్న జనం సోషల్ మీడియాను ఇష్టమొచ్చినటు వాడేస్తున్నారు. వాట్సాప్‌లో అయితే తాము ఇంట్లోనే కూర్చున్నామంటూ స్టే హోమ్‌లాంటి  స్టేట‌స్ వీడియోల‌తో హోరెత్తిస్తున్నారు. ఎన్న‌డూ వాట్సాప్ స్టేట‌స్ గురించి పట్టించుకోనివారు కూడా ఇప్పుడు స్టేట‌స్ ఫీచ‌ర్‌ను పిచ్చ‌పిచ్చ‌గా వాడేస్తున్నార‌ట‌.  ఇంకేముంది. దీంతో వాట్సాప్‌ సర్వర్లు లోడ్ లాగలేక చస్తున్నాయట. సర్వర్ల మీద లోడ్ తగ్గించడానికి ఇండియాలో వాట్సాప్ స్టేటస్ నిడివిని 15 సెకన్లకు తగ్గిస్తున్నామని వాట్సాప్ ప్రకటించింది. 

ఇండియాలోనే ఎందుకంటే?
వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మంది వాడుతున్నారు. అందులో 40 కోట్ల మంది భారతీయులే. అంటే వాట్సాప్ వాడుతున్న ప్రతి ఏడుగురిలో ఒకరు భారతీయుడే. అదీకాక వాట్సాప్ వాడుతున్న యూకే, యూఎస్ లాంటి అగ్ర‌దేశాల్లో లాక్‌డౌన్ లేదు కాబ‌ట్టి వాట్సాప్ పోస్టింగ్‌లు, స్టేట‌స్‌లు పెట్టడం ఏమీ అసాధార‌ణంగా పెరగ‌లేదు. కానీ ఇండియాలో మాత్రం మ‌నోళ్లు స్టేట‌స్‌లతో దుమ్ము దులిపేస్తున్నారు. అందుకే ఇండియాలో మాత్ర‌మే స్టేట‌స్ నిడివిని 15 సెక‌న్ల‌కు త‌గ్గిస్తూ వాట్సాప్ నిర్ణ‌యం తీసుకుంది. లాక్ డౌన్ తర్వాత సర్వర్ల మీద లోడ్ తగ్గితే దీన్ని మళ్ళీ ౩౦ సెకన్లు చేసే అవకాశం ఉండచ్చేమో చూద్దాం 
 

జన రంజకమైన వార్తలు