వాట్సప్... ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్.. అయితే దీనిలో మెసేజ్ చేయడం, ఫొటోలు, వీడియోలు పంపుకోవడం లాంటి ఆప్షన్లు మాత్రమే మనకు తెలుసు. అయితే దీనిలో చాలా ఫీచర్లు కొత్త కొత్తగా వస్తున్నాయి. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా వాట్సప్ ఎప్పటికప్పుడు ఈ యాప్‌ను అప్‌డేట్ చేస్తూ వస్తుంది. ఈ ఏడాది అలా కొన్ని కీలక అప్‌డేట్స్ చేసింది. మరి అలా అందుబాటులోకి వచ్చిన ఫీచర్లు ఏంటో చూద్దామా..
ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్
రీసెంట్‌గా వాట్సప్‌కు యాడ్ చేసిన ఫీచర్ ఇది. దీన్ని యూజ్ చేయడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్ క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ ఫీచర్ మీద ట్యాప్ చేయాలి. అంటే ఈ ఫోన్ ఓఎస్‌లో మీరు స్టోర్ చేసిన ఫింగర్ ప్రింట్‌ని ఫింగర్ ప్రింట్ లాక్ అథంటికేట్ చేస్తుంది. దీనిలో మూడు ఫీచర్లు ఉంటాయి. ఒకటి ఇమిడియట్లీ, ఆఫ్టర్ వన్ మినిట్‌న, ఆఫ్టర్ 30 మినిట్స్ అనే ఆప్షన్లు ఉంటాయి. దీనిలో మీకు నచ్చిన ఆప్షన్ పెట్టుకోవచ్చ. దీని ద్వారా యూజర్లు మెసేజ్‌లను అనేబుల్, డిజేబుల్ చేసుకోవచ్చు. కాల్స్ బ్లాక్ చేయచ్చు.
వాట్సప్ గ్రూప్ ఇన్విటేషన్ సిస్టమ్
ఇటీవలే ఈ మెసేజింగ్ యాప్‌లో గ్రూప్ ఇన్విటేషన్ సిస్టమ్ వచ్చింది. దీని ద్వారా మనల్ని అనవసరంగా గ్రూప్స్‌లో చేర్చే వారిని బ్లాక్ చేయచ్చు. ఇందులో మీకు ఎవ్రీ వన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. అంటే ఫేస్‌బుక్ మాదిరే మీరు గ్రూపుల్లో చేరాలా వద్దా అనేది మీరే డిసైట్ చేసుకోవచ్చు. మీరు మీ కాంటాక్ట్స్ మాత్రమే పరిమితం కావాలాంటే ఆ ఆప్షన్ పెట్టుకోవచ్చు.
గ్రూప్ వీడియో, వాయిస్ కాల్
మామూలుగా మనకు వీడియో కాల్ చేయడం తెలుసు. అలాగే గ్రూప్ వీడియో కూడా చేసుకునే అవకాశం దీనిలో ఉంది. ఇది చాలా తక్కువమంది యూజ్ చేస్తారు. ఒకేసారి భిన్న ప్రదేశాల్లో ఉండేవాళ్లను కలుపుతూ ప్రత్యేమైన విండోస్ ద్వారా ఈ గ్రూప్ కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వాట్సప్ గ్రూప్ చాట్స్‌లోకి వెళితే మీకు కాల్ బటన్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఒకేసారి 30 ఆడియో ఫైల్స్
ఒకసారి ఎక్కువమందికి ఆడియో ఫైల్స్ పంపడం కోసం వాట్సప్ కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. కొత్తగా వచ్చిన ఈ యూఐ ఫీచర్‌ని ఉపయోగించుకుని ఒకేసారి 30 మందికి ఆడియో ఫైల్స్ పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ఆడియో ప్రివ్యూ, ఇమేజ్ ప్రివ్యూకి కూడా సపోర్ట్ చేస్తుంది.