సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.ఈ శీర్షికలో భాగంగా కొన్ని రకాల టిప్స్ గురించి తెలుసుకుందాం.
సింగిల్ మెసేజ్ ను ఒకేసారి చాలా మందికి పంపడం
ఒకే సందేశాన్ని ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి సాధ్యమవుతుంది. మెనూపై క్లిక్ చేసి న్యూ బ్రాడ్ కాస్ట్ ని సెలెక్ట్ చేసుకొని మీ కాంటాక్ట్ లిస్టు లో ఉన్న వారిని సెలెక్ట్ చేసి ఒకే మెసేజ్ ను మల్టిపుల్ సెండింగ్ చేయొచ్చు.
మీ టెక్ట్స్ ను ఫార్మాట్ చేసుకోవడం:
మీరు మెసేజెస్ ను ఇప్పుడు బోల్డ్, ఇటాలిక్స్ లేదా స్ట్రైక్ లో కూడా పంపవచ్చు. మీ ఛాయస్ కు తగ్గట్టుగా వర్డ్స్‌కు ముందుగాని లేదా తరువాత గాని స్పెషల్ క్యారెక్టర్స్ ను యూస్ చేసి అలాగే మీకు నచ్చిన ఫార్మాట్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీరు ఎవరితో ఎక్కువ చాట్ చేస్తారో తెలుసుకోండి:
ఒకవేళ మీరు వాట్సప్ లో ఎక్కువగా ఎవరితో చాటింగ్ చేసారో తెలుసుకోవాలంటే, మీ చాట్ స్క్రీన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న మెసేజస్ స్క్రోలింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు వాటిని ఒకవేళ డిలీట్ చేసి ఉంటే సులభంగా తెలుసుకోవడం కష్టమవుతుంది. దీని కోసం, సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ లోని స్టోరేజ్ యూసేజ్ కి వెళ్లి కాంటాక్ట్ లిస్టులోని దేనిపైన క్లిక్ చేసిన మీరు చాట్ చేసిన, కాల్స్ చేసిన ఎంత డేటాను మీరు పంపారో అనే దానిని బట్టి మీరు ఎవరితో ఎక్కువ చాట్ చేసారో చెప్పొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఫోన్లో మాత్రమే అందుబాటులో ఉంది.
చాట్స్, గ్రూప్స్ ను మ్యూట్ చేయండి:
ఎవరైనా అనవసరమైన మెసేజస్ ను పంపుతుంటే కాంటాక్ట్ లేదా గ్రూప్ ని సెలెక్ట్ చేసి మెనూ లోని మ్యూట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
గ్రూప్ లో మీ మేసేజెస్ ఎవరు చదివారో తెలుసుకోవాలని ఉందా ?
మీ సన్నిహితులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చెందిన గ్రూప్స్ లో మీరు ఒక్కోసారి పోస్ట్స్ చేస్తుంటారు. ఆ పోస్ట్స్ వారు చదివారో లేదో తెలుసుకోవాలనే కుతూహలం ఉండటం సహజమే. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు పంపిన మెసేజ్, ఫోటో, లేదా వీడియోను ప్రెస్ చేస్తే పై విండోలో ఆప్షన్స్ వస్తాయి
గ్రూప్ లో పోస్ట్ చేసిన మెసేజెస్ అందరికీ డిలీట్ చేస్తారా ?
ఒక్కోసారి మనం యాక్సిడెంటల్ గా గ్రూప్స్ లో మెసేజెస్ పెట్టేస్తాం.. తర్వాత అది అందరూ చూడకముందే డిలీట్ చేయాలని అనుకుంటాం. ఎలా డిలీట్ చేయాలో తెలీక సతమతమవుతాం. మీరు పోస్ట్ చేసిన మెసేజ్ ను క్లిక్ చేసిన తర్వాత డిలీట్ ఫర్ ఎవిరీ వన్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే గ్రూప్ లో మరెవరికీ ఈ మెసేజ్ కనబడదు.
మెసేజెస్ ను అన్ రీడ్ చేయండిలా..
బ్లూటిక్స్ వల్ల అవతలి వాళ్లు వారి మెసేజెస్ చదివారా లేదనేది తెలుస్తుంది. కానీ అలా తెలియకుండా బోల్తా కొట్టించవచ్చు. మార్క్ యాస్ అన్ రీడ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా సదరు మెసేజ్ ను చదవనట్లు గుర్తించవచ్చు
చాట్ మొత్తం ఈమెయిల్ చేసే ఆప్షన్..
మీరు చేసిన చాట్ మొత్తం ఏక మొత్తంలో మీరు ఎంపిక చేసుకున్న మెయిల్ ఐడీకి ఈమెయిల్ చేసుకునే సదుపాయం వాట్సప్ కల్పించింది. తద్వారా చాట్ డిలీట్ అయినప్పటికీ ఈ మెయిల్ లో మొత్తం చాట్ డేటా నోట్ పాడ్ రూపంలో స్టోర్ అవుతుంది.
కన్వర్జేషన్ ను పిన్ చేసుకోండిలా ..
మీ వాట్సప్ కాంటాక్ట్స్ లిస్టు చాంతాడంత పొడుగు అయిపోయి, మీ అత్యంత సన్నిహితులను ప్రతి సారి సెర్చ్ లిస్ట్ లో టైప్ చేస్తూ వెతకాల్సి వస్తుందా. అయితే మీరు ఎంపిక చేసుకున్న కాంటాక్ట్స్ ను పిన్ చేసుకోవడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి తప్పించుకునే వీలుంది. ఏవైనా మూడు కాంటాక్ట్స్ ను పిన్ చేసుకుంటే అవి పిన్ అవుతాయి. అప్పుడు సులభంగా గుర్తించవచ్చు.
ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే
గరిష్ఠంగా మూడు ఫేవరెట్ చాట్స్‌ను యూజర్లు ఎంపిక చేసుకోవచ్చు. మీ ఫేవరెట్ చాట్ అనుకున్న దానిని ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే పైన పిన్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకుంటే.. ఆ చాట్ ఇక ఎప్పుడూ పైనే ఉంటుంది. ఒకవేళ దీనిని అన్‌పిన్ చేయాలనున్నా మళ్లీ ఇలాగే చేయాలి
వాట్సప్ నోటిఫికేషన్లు పాపప్ కావాలంటే..?
స్క్రీన్ ఆఫ్ అయిన సమయంలోనూ వాట్సప్ నోటిఫికేషన్లు పాపప్ కావాలంటే..? వాట్సాప్ మెసేజ్ అందిన ప్రతిసారి ఫోన్ ను అన్ లాక్ చేయవల్సి వస్తుందా..? ఈ సమస్యకు వాట్సప్ చక్కటి పరిష్కారం చూపుతోంది. ఫోన్ లాక్ చేసిన ఉన్నప్పటికి వాట్సాప్ మెసేజ్లను చూసేందుకు ఇలా చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి Notifications > Popup Notifications > Only When Screen Off.
నచ్చిన బ్యాక్‌గ్రౌండ్
మీ వాట్సప్ అకౌంట్‌ను నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌తో తీర్చిదిద్దండి. ఇలా చేయాలంటే స్ర్కీన్ కుడివైపు పై భాగంలో కనిపించే మూడు నిలువు చుక్కల పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లినట్లయితే మీకు వాల్ పేపర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్లినట్లయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. వాటిలో మీకు నచ్చిన ఫోటోను బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చు.
డేటా ఖర్చును తగ్గించుకోవడం
డేటా ఖర్చును కంట్రోల్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పిస్తోంది. అకౌంట్ సెట్టింగ్స్ లో వెళ్లి Media auto-download ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీకు నచ్చిన డేటాను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసలబాటు ఉంటుంది.
వాట్సప్ వెబ్
మీ వాట్సప్ అకౌంట్, వాట్సప్ వెబ్‌కు అనుసంధానించుకోవాలంటే ముందుగా మీ డెస్క్‌టాప్ వెబ్‌బ్రౌజర్‌లోని web.whatsapp.comలోకి వెళ్లండి. ఓ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇపుడు మీ ఫోన్ కుడి వైపు కార్నర్‌లో కనిపించే మూడు చుక్కలు పై క్లిక్ చేసి WhatsApp Web ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయండి. ఇలా చేయాలంటే తప్పనిసరిగా రెండు డివైజ్ లు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
చేంజ్ నెంబర్
ఆండ్రాయిడ్ యూజర్లు మెనూలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ విభాగంలో కనిపించే చేంజ్ నెంబర్ ఆప్షన్ ద్వారా తమ వాట్సప్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.