ప్రముఖ సోషల్ మీడియాలో ఒకటైనా వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటికే వాట్సప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వాయిస్ మెసేజెస్, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్, డార్క్ మోడ్‌పై వాట్సప్ బీటా టెస్టింగ్ చేస్తోంది. దీంతో పాటు 3డి టచ్ యాక్షన్ ను కూడా పరీక్షిస్తోంది. కాగా వాట్సప్ కు ఇండియాలో 22 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఛాట్ యాప్ గా వాట్సప్ నిలిచింది. ప్రతి నెలా ఏవో కొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకువచ్చే వాట్సప్ ఈ ఏడాది తీసుకురానున్న 5 కొత్త ఫీచర్లను ఓ సారి చూద్దాం.
డార్క్ మోడ్
డార్క్ మోడ్‌పై వాట్సప్ వర్క్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ నలుపు రంగులో ఉండి.. ఇతర ఐకాన్స్ అన్నీ గ్రీన్ కలర్‌లో ఉంటాయి. వాట్సప్‌బీటాఇన్ఫో డార్క్ మోడ్‌కు సంబంధించి ఫోటోలను ఇప్పటికే షేర్ చేసింది. వాట్సప్ సెట్టింగ్ మెనులోకి వెళ్లి డార్క్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్‌పై ఇదివరకే బీటా అప్‌డేట్‌లో వాట్సప్ టెస్ట్ చేసింది. ఇప్పుడు ప్రొఫైల్ సెక్షన్‌లో డార్క్ మోడ్ కోసం వాట్సప్ టెస్ట్ చేస్తోంది.
Consecutive voice messages
వాట్సప్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వాయిస్ మెసేజెస్‌కి అదనంగా... ఒకటి కంటే ఎక్కువ వాయిస్ మెసేజ్‌లను వరుసగా ప్లే చేసుకునే సదుపాయాన్ని త్వరలో వాట్సప్ తీసుకురానుంది. ఒకదాని తర్వాత మరోటి ప్లే చేయాలనుకున్నా... ఒకేసారి అన్ని ఆడియో క్లిప్స్ ప్లే చేయాలనుకున్నా ఈ ఫీచర్ ద్వారా చేసుకోవచ్చని.. యూజర్లు ఆడియో క్లిప్ ప్లే బటన్ మీద నొక్కాల్సిన అవసరం లేదని వాట్సప్ వెల్లడించింది.
3D Touch to check WhatsApp status
ఈ ఫీచర్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆపిల్ ఐఫోన్ యూజర్లు ఎవరైనా పంపిన మెసేజ్ ని రిసీవ్ చేసుకున్నట్లు తెలియకుండా దానికి ఎటువంటి రిప్లయి ఇవ్వకుండానే 3డి టచ్ ద్వారా దాన్ని చెక్ చేయవచ్చు.
ర్యాకింగ్ కాంటాక్ట్స్
వాట్సప్ త్వరలో ర్యాకింగ్ కాంటాక్ట్స్ ఫీచర్ ని తీసుకురానుంది. దీని ద్వారా కాంటాక్ట్స్ కి ర్యాకింగ్స్ కేటాయించబడతాయి. తద్వారా మనం వారితో మరింగా ఇంటరాక్ట్ కావచ్చు.
WhatsApp fingerprint authentication
వాట్సప్ యూజర్ల కోసం కొత్తగా సెక్యూరిటీలో fingerprint authenticationను తీసుకురానుంది. దీని ద్వారా వాట్సప్ అకౌంటు మరింత సెక్యూరిటీగా ఉండే అవకాశం ఉంది. ధర్డ్ పార్టీ లాకింగ్ యాప్ సపోర్ట్ చేసే విధంగా ఇది రానుంది.
ఫీచర్ పిక్చర్ ఇన్ పిక్చర్(పీఐపీ)
ఫీచర్ పిక్చర్ ఇన్ పిక్చర్(పీఐపీ) మోడ్‌లోనూ మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. పీఐపీ ఫీచర్ ప్రకారం... యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను వాట్సప్‌లోనే ప్లే చేసుకోవచ్చు. అయితే.. ప్రస్తుతం ఉన్న ఫీచర్‌లో వాట్సప్ యాప్ ఓపెన్‌లో ఉంటేనే ఆ వీడియోలను చూసే వెసులుబాటు ఉంది. వాట్సప్ యాప్‌ను క్లోజ్ చేస్తే వీడియో కూడా ప్లే అవదు. కానీ.. కొత్తగా వచ్చే ఫీచర్ ద్వారా వాట్సప్ యాప్‌ను క్లోజ్ చేసినా సరే.. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూనే ఉంటుంది.