వాట్సాప్ లో ఓ కీలక అప్‌డేట్ వస్తోంది. మీరు ఒకవేళ మీరు మీ నెంబర్ మారిస్తే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారందరికీ అదే మెసేజ్ పంపుతుంది. వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్ (2.17.375)లో ఈ కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. మీరు వాట్సాప్ నెంబర్ మారిందని అందరికీ చెప్పాల్సిన అవసరం లేకుండా యాప్పే మెసేజ్ సెండ్ చేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు ఈ మెసేజ్ ఎవరికి పంపాలో కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు.
యాప్ సైజ్ తగ్గుతుంది
ఈ అప్‌డేట్‌లో మరో విశేషమేమిటంటే యాప్ సైజ్ కూడా తగ్గబోతోంది. కనీసం 6 ఎంబీ సైజ్ తగ్గుతుంది. అంటే మీ ఫోన్‌లో అంత మెమరీ సేవ్ అయినట్లే. దీనింతోపాటు యాప్‌లో ఉన్న 473 మైనర్ ఎర్రర్స్‌ను ఈ అప్‌డేట్ ద్వారా ఫిక్స్ చేసినట్లు వాట్సాప్ చెబుతోంది. ఈ కొత్త అప్‌డేట్ త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఐవోఎస్ యూజర్లకు ఎప్పుడు ఈ అప్‌డేట్ ఇస్తామో కంపెనీ ప్రకటించలేదు.