వాట్సప్.. అందరూ ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా సర్వీస్. వాట్సప్ స్టేటస్ పెట్టడం లేదా స్టోరీని యాడ్ చేయడం అనేది ఇప్పుడో పెద్ద ట్రెండ్. మన భావాలను లేదా మన మూడ్‌ని చెప్పడానికి వాట్సప్ స్టేటస్‌ను ఒక ఆప్షన్‌గా ఉపయోగిస్తున్నారు యూజర్లు. ప్రతి రోజూ ఒక స్టేటస్ మార్చడం చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది. అయితే మన స్టేటస్ లేదా స్టోరీని వేరే వాళ్లు చూశారా లేదా అన్న కుతూహలం కూడా ఉంటుంది. మరి మన స్టేటస్‌ను ఎవరెవరు చూస్తున్నారు.. మన స్టోరీలపై ఎవరు కన్నేస్తున్నారు అనే విషయం మీకు తెలుసా? .. తెలియకపోతే ఎలాగో తెలుసుకుందామా!
2017 మే నెలలో వాట్సప్ స్టేటస్ తొలిసారిగా యూజర్లకు పరిచయం అయింది. ఇప్పటివరకు మనకు ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్‌లో స్టోరీల గురించి, స్టేటస్‌ల గురించి మాత్రమే తెలిసిన వినియోగదారులకు తొలిసారి వాట్సప్ స్టేటస్ అంటే ఏమిటో తెలిసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 450 మిలియన్ల యూజర్లు వాట్సప్ స్టేటస్‌ను యూజ్ చేస్తున్నారని అంచనా. ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. అయితే మన వాట్సప్ స్టేటస్ లేదా స్టోరీ ఎవరెవరు చూశారో తెలుసుకోవడానికి చిన్న క్లిక్ చాలు. మనం స్టేటస్ ఓపెన్ చేయగానే ఎవరు మన స్టేటస్ ఫాలో అయ్యారో అడుగు భాగంలో ఒక ఐకాన్ వస్తుంది. దాన్నిపైకి స్వైప్ చేస్తే ఫాలో అయిన వాళ్ల జాబితా కూడా వస్తుంది.
అయితే స్టోరీ చూసిన ప్రతి ఒక్కరి పేర్లను మనం చూసే అవకాశం ఉండదు. మనకు నెంబర్లు మాత్రమే కనబడతాయి. ఒక్కోసారి ఇవి కూడా కనబడవు. మరి ఇలాంటప్పుడు మనమేం చేయాలి?.. మన స్నేహితులు ఏ పేరుతో మన నంబర్‌ను ఫోన్ బుక్‌లో సేవ్ చేసుకున్నామన్నదే ముఖ్యం. కొంతమంది మీ పేరుతో కాకుండా నంబర్ మాత్రమే సేవ్ చేసుకుంటారు వాళ్ల ఫోన్‌లో దీని వల్ల వాళ్లు మన స్టేటస్ స్టోరీ చూసినా ఆ నంబర్ వస్తుంది తప్ప పేరు రాదు. దీనికి కారణం మన వాట్సప్ కంటెంట్ ఎవరు చూడాలన్న ఆప్షన్‌లో మనం మై కాంటాక్ట్స్ ఓన్లీ అని సెలక్ట్ చేసుకోవడమే. స్టేటస్ ప్రైవసీ ఆప్షన్ దగ్గరకు వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను పబ్లిక్‌గా చేసుకుంటే మన స్టేటస్‌ని అందరూ చూసే అవకాశం ఉంది.