వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ లేదన్నంతగా ఈ మెసేజింగ్ యాప్ అల్లుకుపోయింది. అయితే వాట్సాప్‌లో వాయిస్, వీడియో కాల్స్ కూడా ఫ్రీకావడంతో వీటిని ఉపయోగించుకునేవారు ఎక్కువయ్యారు. అవసరం ఉంటే ఓకే కానీ ఫ్రీగా వస్తుంది కదా అని వాట్సాప్‌లో వీడియో, వాయిస్ కాల్స్‌చేసి విసిగించే బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఇలాంటి వారిని బ్లాక్‌చేయకుండానే కాల్స్‌ను మాత్రం డీయాక్టివేట్ చేయొచ్చు. అయితే ఇది వాట్సాప్ అఫీషియల్ యాప్‌లో సాధ్యపడదు.
జీబీవాట్సప్‌లో..
జీబీవాట్సాప్ అనేది వాట్సాప్‌లో మోడెడ్ వెర్షన్.అయితే వాట్సాప్ అఫీషియల్ యాప్ కాదు కానీ దానిలోని చాలా ఫీచర్లు ఇస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే పర్సన్‌ను బ్లాక్‌చేయకుండానే వాయిస్, వీడియో కాల్స్‌ను డీయాక్టివేట్ చేయొచ్చు.
1. Settings > Chats > Chat backupలోకి వెళ్లి మీ చాట్ బ్యాకప్ తీసుకోండి.
2. ఇప్పుడు GBwhatsapp యాప్ డౌన్‌లోడ్ చేసిఇన్‌స్టాల్ చేయండి.
3. ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తేSettings > Security ఆప్షన్‌లోకి Unknown Sources Installationను టర్న్ ఆన్ చేయండి.
4. ఇప్పుడు జీబీవాట్సాప్ యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి. చాట్ హిస్టరీని రీస్టోర్ చేసుకోండి.
5. తర్వాత Menu > GBSettings > Other Mods ఆప్షన్ క్లిక్ చేయండి.
6. దీనిలో Disable Voice Calls ఆప్షన్ ఉంటుంది. దీన్ని టర్న్ ఆన్ చేస్తే మీకు వాయిస్ కాల్స్,వీడియో కాల్స్ రావు.
వాట్సాప్ ట్వీక్స్ యాప్ (WA Tweaks App)
మీరు వాట్సాప్ అఫీషియల్ యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయకుండానే కాల్స్‌ను బ్లాక్ చేయాలనుకుంటే WA tweaks యాప్‌ను వాడుకోవచ్చు.
1. ఫోన్‌లో Settings >Apps> Whatsapp లోకి వెళ్లి Force stop కొట్టండి. ఇప్పడు ఫోన్‌ను Airplane modeలో పెట్టండి.
2.WA Tweaks యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.
3. యాప్‌ను ఓపెన్ చేసి మెనూలోకి వెళ్లి Extra optionక్లిక్ చేయండి.
4.Disable Voice and video Calls ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేయండి.
5.ఇప్పుడు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆఫ్‌చేసి మీ ఒరిజినల్ వాట్సాప్ యాప్‌ను వాడుకోండి.
ఇక మీరు ఎవరు వాట్సాప్ వాయిస్, వీడియో కాల్ చేసినా ఆటోమేటిగ్గా డిక్లయిన్ అయిపోతుంది.