• తాజా వార్తలు

వాట్సాప్ వల్ల కాని ఫేక్ న్యూస్ అంతు తాను చూస్తానంటున్న ఢిల్లీ ప్రొఫెసర్.. 


ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. అంతటి యాప్ కూడా ఫేక్ న్యూస్ దెబ్బకి వణికిపోతోంది. పుకార్లు, వదంతులు వ్యాప్తి చేయడానికి ఎక్కువ మంది వాడుతున్న సాధనం ప్రస్తుతం వాట్సప్పే.  ఇలాంటి వదంతులు వైరల్ గా మారి అమాయక ప్రజల మీద దాడుల వరకు తీసుకెళ్తోంది. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయనే పుకార్లు వాట్సాప్ లో వైరల్ అవడంతో మొన్నీ మధ్య బీదర్ లో ఒక వ్యక్తిని కొట్టి  చంపేశారు. ఆవులను చంపేవాళ్లంటూ చాలామందిపై దాడులు జరిగేలా ఫేక్ న్యూస్ వాట్సప్‌లో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఫేక్ న్యూస్ కాకుండా కంట్రోల్ చేయడానికి వాట్సప్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మెసేజ్ ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మందికి ఫార్వార్డ్ చేయకుండా కంట్రోల్ చేసింది. కానీ ఫేక్ న్యూస్ కంట్రోల్ కావడం లేదని మధన పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని ఇంద్రప్రస్తా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన పొన్నూరంగం కుమార్ గురు అనే ప్రొఫెసర్ వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ఒరిజినల్ లేదా ఫేక్ న్యూసా అనేది కనిపెట్టడానికి ఒక యాప్ తయారు చేస్తానని చెబుతున్నారు. వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ఫేక్ న్యూసా లేక genuina తేల్చేయడానికి ఈ యాప్ ఉపయోగ పడుతుందని  కుమార్ గురు చెబుతున్నారు. 

ఎలా ఎన‌లైజ్ చేస్తారు?
ఇలాంటి మెసేజ్ లను 9354325700 నంబర్ కి పంపాలని కోరారు. వీటిని ఎన లైజ్ చేస్తామని, ఇలాంటి మెసేజ్ లు అన్నింటిలోనూ ఏదైనా ఒక ఇమేజ్, వీడియో, లింక్ లేదా యుఆర్ఎల్ కామన్ గా ఉంటుందన్నారు. అలాంటివి ఉంటే అది ఎక్కువ శాతం ఫేక్ మెసేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటివన్నీ  విశ్లేషించి  ఆ మెసేజ్ ఫేక్ న్యూసా కాదా ఒక అవగాహన కు రావచ్చంటున్నారు. దీన్ని బేస్ చేసుకుని ఒక యాప్ తయారు చేస్తున్నామన్నారు. 

ఎలా గుర్తించాలి? 
మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అనేది తెలుసుకోవడానికి ఒక pattren develop చేస్తామన్నారు.

ఉదాహరణకు ఒక మెసేజ్ వచ్చినప్పుడు అది గ్రీన్ కలర్ లో  ఇండికేట్ అయితే అది సాధారణ మెసేజ్.

అదే రెడ్ కలర్ లో కనిపిస్తే  కచ్చితంగా ఫేక్ మెసేజ్.

ఒకవేళ  మెసేజ్ పసుపు  రంగులో ఇండికెట్ అయితే దాన్ని సిస్టం డీకోడ్ చెయ్యలేకయిందని అర్ధం.

ఇలా ఫేక్ న్యూస్ ను గుర్తించే మోడల్ తో యాప్ను రెండు నెలల్లో అందుబాటులో కి తీసుకొస్తామని కుమారుగురు చెబుతున్నారు

జన రంజకమైన వార్తలు