వాట్సప్... ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్.. బారత్‌లో దీని వినియోగం మరీ ఎక్కువ. రోజు రోజుకు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అయితే భారత్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండడంతో వాట్సప్ కూడా మన దేశంపైనే ఎక్కువగా దృష్టి సారించింది. మరి వాట్సప్ ఎంత వరకూ సేఫ్. దీని వల్ల ఏమైనా నష్టం ఉందా! వాట్సప్ భారత్‌లో మాత్రమే మెసేజ్‌లను ఆరిజనేషన్‌ను ట్రేస్ చేస్తుందా!
ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సప్ ఎంత వరకూ సురక్షితం అనే విషయంపై గతంలోనూ చర్చలు నడిచాయి. ఒక మెసేజ్ ఎక్కడ పుడుతుంది. ఎక్కడ నుంచి వస్తుంది. ఎటు వెళుతుంది అనే విషయాలను వాట్సప్ ట్రేస్ చేసే అవకాశం ఉందని గతంలో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఈ కానీ ఈ మెసేజింగ్ సంస్థ ఈ పిర్యాదులను కొట్టి పారేసింది. వాట్సప్ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయని దీని వల్ల థర్డ్ పార్టీకి ఈ మెసేజ్‌లు చూసే అవకాశం ఉండదని వాట్సప్ బలంగా వాదించింది. ఫేక్ మెసేజ్‌లు పంపించే అకౌంట్లను తొలగిస్తున్నట్లు కూడా ఈ సంస్థ తెలిపింది.
ఇటీవలే వాట్సప్ రెండు మిలియన్ల అకౌంట్లను తొలగించింది. భారత్‌లో ఎన్నికల నేపథ్యంలో అరాచర శక్తులకు అడ్డుకట్ట వేయడం కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్ ఇండియా తెలిపింది. ముఖ్యంగా గ్రూప్ మెసేజ్‌ల విషయంలో వాట్సప్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో ప్రచారం కోసం కొంతమంది వాట్సప్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే మంచి కోసం ఉపయోగిస్తే ఫర్వాలేదు కానీ అనవసరమైన విషయాలను వ్యాప్తి చేయడం కోసం కూడా ఈ సర్వీసులను వాడుకుంటున్నారు. ఇలాంటి వాటిని గుర్తించి ముందుగానే వాటిని తొలగిస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. గ్రూపు సైజుల విషయంలో కూడా వాట్సప్ లిమిట్ పెట్టింది. 10 మంది కన్నా ఎక్కువ ఉన్న గ్రూపులను క్రియేట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు.