• తాజా వార్తలు

వాట్సాప్ స్టేట‌స్‌లో 30 సెక‌న్స్ కంటే ఎక్కువ నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేయ‌డం ఎలా?

స్నాప్‌చాట్‌లోని ఫీచ‌ర్స్‌తో ఇన్‌స్పైర‌యి  వాట్సాప్ తీసుకొచ్చిన స్టేట‌స్ ఫీచ‌ర్ సూప‌ర్ హిట్ అయింది. పిల్ల‌ల వీడియోలు, ఎక్క‌డిక‌యినా వెకేష‌న్ వెళితే అక్క‌డ ఫొటోలు, గుడికో, పార్క్‌కో వెళ్లిన‌వి, ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లు, మూవీ ట్రైల‌ర్స్‌, సాంగ్స్‌, డైలాగ్స్ ఇలా ఒక‌టేమిటి వాట్సాప్ స్టేట‌స్‌లో ఎన్నో చూస్తున్నాం. అయితే ఇందులో ఉన్న ఒకే ఒక మైన‌స్ 30 సెకండ్స్ కంటే ఎక్కువ నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేయ‌లేక‌పోవ‌డం. దానికీ సొల్యూష‌న్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ప‌దండి.

రెండు ర‌కాల మార్గాలు
ఇందులో ఫ‌స్ట్ ప‌ద్ధ‌తి..ఒక వీడియోను పార్ట్‌పార్ట్‌లుగా షేర్ చేయ‌డం. అంటే ఒకసారి 30 సెకండ్స్ స్టేట‌స్‌లో పెట్టాక ఆ నెక్స్ట్ 30 సెక‌న్ల వీడియోను మ‌రో స్టేట‌స్‌లో పెట్ట‌డం. ఎన్ని పెట్టాల‌న్న లిమిట్ లేదు కాబ‌ట్టి ఇలా కంటిన్యూ క్లిప్‌తో మ‌న వీడియోను షేర్ చేయొచ్చు. రెండోది వీడియోను జిఫ్‌గా కన్వ‌ర్ట్ చేసి షేర్ చేయ‌డం. దీనికి కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 

వాట్స్‌క‌ట్ ప్రో ప్ల‌స్  WhatsCut Pro+
1. వాట్స్‌క‌ట్ ప్రోప్ల‌స్ ఒక ఫ్రీ యాప్‌.  దీన్ని ప్లే స్టోర్‌లో నుంచి ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి.

2. దీని హోం స్క్రీన్ మిమ్మ‌ల్ని డైరెక్ట్‌గా ఫోన్‌లోని వీడియో లైబ్ర‌రీకి గైడ్ చేస్తుంది. అక్క‌డ మీరు స్టేట‌స్‌గా పెట్టాల‌నుకున్న వీడియోను సెలెక్ట్ చేయండి. మొత్తం వీడియోనుగానీ అందులో కొంత భాగాన్ని గానీ సెలెక్ట్ చేయండి. రెడీ అయ్యాక గ్రీన్ క‌ల‌ర్ యారో కీని నొక్కండి.

3.ఇది ఇప్పుడు మీ వీడియోను చిన్న‌చిన్న ముక్క‌లుగా విడ‌గొట్టి స్టేట‌స్‌గా పెట్ట‌డానికి ర‌డీ చేస్తుంది. మీరు దాన్ని ప‌బ్లిక్‌గా పెట్టాలా?  కొంత‌మందికే క‌నిపించేలా చేయాలా అనేది వాట్స‌ప్ స్టేట‌స్ విండోలో సెలెక్ట్ చేసుకుంటే అది ఆ ప‌ద్ధ‌తిలో మీ వాట్స‌ప్ స్టేట‌స్‌లో పోస్ట్ అవుతుంది.

జిఫ్ షాప్‌తో జిఫ్ క్రియేట్ చేయడం (Create a GIF Image Using  GIFShop)
మీరు వీడియోను జిఫ్ ఇమేజ్‌గా క్రియేట్ చేసుకుంటే ఈజీగా  పోస్ట్ చేసుకోవ‌చ్చు. ఎందుకంటే ఇమేజెస్‌కు నెంబ‌ర్ లిమిట్ లేదు. అయితే ఇవి ఇమేజ్‌లు కాబ‌ట్టి ఈ వీడియోకు సౌండ్ ఉండ‌దు. ఇదొక్క‌టే మైన‌స్‌.                

1. GIFShop యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. 

2. నెక్స్ట్ స్టెప్‌కు వెళితే అక్క‌డ హోం స్క్రీన్‌లో చాలా ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వాటిలో నుంచి Videos -> GIF optionను సెలెక్ట్ చేసుకోండి. 

3. ఇప్పుడు యాప్ మిమ్మ‌ల్ని వీడియో లైబ్ర‌రీకి తీసుకెళుతుంది. మీరు వాట్సాప్ స్టేట‌స్‌లో షేర్ చేయాల‌నుకున్న వీడియోను సెలెక్ట్ చేయండి. యాప్ మీ వీడియోను  జిఫ్ ఇమేజ్‌లుగా మార్చే ప్ర‌క్రియ ప్రారంభిస్తుంది. బెస్ట్ ఇమేజ్‌లు చూపిస్తుంది. వీటిలో కావాలంటే మార్పులు చేసుకోవ‌చ్చు.

4. CONFIRM బ‌ట‌న్ నొక్కితే ఒకే ఒక జిఫ్ త‌య‌రావుతుంది. దాన్ని మీ వాట్సాప్ స్టేట‌స్‌లో పోస్ట్ చేసుకోవ‌చ్చు.
 

జన రంజకమైన వార్తలు