వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ ఇస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ ఫోన్లన్నింటికీ ఈ అప్‌డేట్స్ వస్తున్నాయి. ఇక బీటా యూజర్లకు అయితే రోజుకో కొత్త అప్‌డేట్ వస్తుంది. రోజుకు రెండు అప్‌డేట్స్ వస్తున్న రోజుకలు కూడా ఉన్నాయి. అయితే ఈ అప్‌డేట్స్ అన్ని సార్లూ సక్సెస్ కావు. లేటెస్ట్‌గా వచ్చిన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ అప్‌డేట్ మీ యాప్‌ను క్రాష్ చేస్తుంది. హోం స్క్రీన్ మీద ఈ క్రాష్ మెసేజ్ కనిపిస్తుంది. ఇది యూజర్లు తమ ఫోన్‌ను యూజ్ చేసుకోవడాన్ని కూడా అడ్డుకోంటోంది. ఇలాంటి ప్రాబ్లమ్ మీరు కనుక ఫేస్ చేస్తుంటే దానికి సొల్యూషన్ ఇదీ..
ఆండ్రాయిడ్ నోగట్ 7.0 యూజర్లకే
ఇలా వాట్సాప్ అప్‌డేట్‌తో ఫోన్ క్రాష్ అవుతున్న పరిస్థితి ఎక్కువగా ఆండ్రాయిడ్ 7.0నోగట్ ఓఎస్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలోనే ఎక్కువ కనిపిస్తుంది. అందులోనూ థర్డ్ పార్టీ ఓఈఎమ్ స్కిన్ వాడుతున్న ఫోన్లలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందని టెక్ ఎక్స్‌పర్ట్‌లుచెబుతున్నారు. అయితే ఆండ్రాయిడ్ 7.1.2 నోగట్ ఓఎస్‌తో వచ్చిన మోటో ఎక్స్4లో కూడా ఈ క్రాషింగ్ ప్రాబ్లం ఉన్నట్లు గుర్తించారు. మీరు గనుక ఇలాంటి ఓఎస్‌లు వాడుతుంటే ఈ క్రాషింగ్ ప్రాబ్లమ్ మీ ఫోన్‌కూ వచ్చే అవకాశం ఉంది.
ఇలా ఫిక్స్ చేయండి
ఈ ప్రాబ్లమ్ మీకుంటే ఫిక్స్ (సాల్వ్)చేయడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే ప్రస్తుతమున్న యాప్‌లో క్యాచ్ క్లియర్‌చేసినా, అప్లికేషన్‌ను force stopping చేసినా ఈ క్రాషింగ్ ప్రాబ్లమ్ క్లియర్ కావట్లేదు. అందుకే Whatsapp.com/android లోకి వెళ్లి ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌ను మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోండి. దీంతో మీ చాట్స్‌లో కొన్నిఎరేజ్ అయ్యే ప్రమాదముంది. అలాగని మొత్తం చాట్స్‌ను బ్యాకప్ తీసుకుందామన్నా కుదరదు.కానీ క్రాషింగ్ ప్రాబ్లం క్లియర్ కావాలంటే ప్రస్తుతానికి తప్పదు. ఎందుకంటే వాట్సాప్ ఇంతవరకు ఈ ప్రాబ్లమ్‌ను ఎలా సాల్వ్ చేయాలో చెప్పలేదు.