వాట్సాప్ యూజర్లందరూ ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటి? ఏ మాత్రం ఆలోచించక్కర్లేదు. కచ్చితంగా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్‌లే. వాటి వల్ల ఎంత విసుగు పుడుతుందంటే అసలు కొంత మంది ఈ గుడ్‌మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్‌ల బాధ పడలేక వాట్సాప్‌నే అన్ఇన్‌స్టాల్ చేయాలనుకునేంత. అలా అని మెసేజ్‌లు చదవకుండా వదిలేద్దామంటే అది గుడ్‌మార్నింగ్ మెసేజ్ కాకుండా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ అయితే కష్టం. కానీ దీనికో పరిష్కారం ఉంది. అదే వాట్‌స్పామ్ యాప్. ఈ యాప్ మిమ్మల్ని ఈ విష్ మెసేజ్‌ల నుంచి ఎలా కాపాడుతుందో చూద్దాం.
ఎలా పని చేస్తుంది?
జైపూర్‌లోని మణిపాల్ యూనివర్సిటీకి చెందిన శిష్ట్లా విష్ణువర్ధన్, బీవీఎస్ రేవంత్ అనే ఇద్దరు విద్యార్థులు ఈ యాప్‌ను తయారుచేశారు.
Good xxxxxxxx","Have a nice xxxxxx","Happy xxxxxxx day","Wish you xxxxxx ఇలాంటి పదాలున్న ఇమేజ్‌లను స్పామ్‌గా గుర్తిస్తుంది. తర్వాత వాటిని ఆటోమేటిగ్గా డిలీట్ చేస్తుంది.
* ప్రతి రోజూ రాత్రి 11 గంటలకు ఈ మెసేజ్‌లను డిలీట్ చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా గుడ్ నైట్ మెసేజ్‌లు కూడా 11 గంటలకు పూర్తవుతాయి కాబట్టి అప్పుడు డిలీట్ చేస్తుంది.
* ఒకవేళ మీరు ఈ గుడ్ మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజ్‌ల్లో వేటినైనా సేవ్ చేసుకోవాలన్నా కూడా సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంది.
వాట్‌స్పామ్‌లో ఇతర ఫీచర్లు
* మీ వాట్సాప్ ఇమేజ్‌లన్నింటినీ All Images అనే ఫోల్డర్‌లో ఒకేచోట చూపిస్తుంది. వాటిని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు.
* మీరు ఒకరోజు రివ్యూ చేసుకున్న ఇమేజ్‌లన్నింటినీ Today's Images అనే దానిలో చూపిస్తుంది.
* డూప్లికేట్ ఇమేజ్‌లను కూడా స్పామ్‌గా గుర్తిస్తుంది.
* వాట్‌స్పామ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక తర్వాత వచ్చిన స్పామ్ మెసేజ్‌లను మాత్రమే డిలీట్ చేస్తుంది. అంతకు ముందే మీకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లను డిలీట్ చేయలేదు. వాటిని మీరు మామూలుగానే తొలగించుకోవాలి.