• తాజా వార్తలు

వాట్సాప్‌లో చాట్‌ను ఇక ఎప్ప‌టికీ మ్యూట్‌లోనే పెట్టుకునే.. ఆల్వేస్ మ్యూట్ ఆప్ష‌న్ వ‌చ్చేసింది

వాట్సాప్ చాట్‌ను మ్యూట్‌లో పెట్టుకోవ‌డం మ‌నంద‌రికీ తెలుసు. అయితే దానికి ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. 24 గంట‌లు లేదా ఒక వారం లేదా ఒక సంవ‌త్స‌రం అని గ‌డువు ఉంటుంది. అందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే అంత వ‌ర‌కు ఆ చాట్ మ్యూట్‌లోనే ఉంటుంది. ఆ కాంటాక్ట్ లేదా గ్రూప్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ వ‌చ్చినా మీకు ఎలాంటి అల‌ర్ట్ రాదు.  కావాలంటే ఆ చాట్ ఓపెన్ చేసుకుని మీరు తీరిగ్గా ఉన్న‌ప్పుడు చూసుకుంటారు. ఇక‌పై అలాంటి చాట్‌ను ఎప్ప‌టికీ మ్యూట్‌లోనే పెట్టుకునే ఫీచ‌ర్ వ‌చ్చేసింది.

ఆల్వేస్ మ్యూట్ 
మామూలుగా ఏదైనా కాంటాక్ట్‌, గ్రూప్ చాట్‌ను మ్యూట్ చేయాలంటే సెట్టింగ్స్లో మ్యూట్ ఆప్ష‌న్ క్లిక్  చేస్తాం. అందులో 24 గంట‌లు, ఒక వారం లేదా ఒక సంవ‌త్స‌రం అనే మూడు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఇప్పుడు వ‌న్ ఇయ‌ర్ అనే ఆప్ష‌న్ ప్లేస్‌లో ఆల్వేస్ అనే ఆప్ష‌న్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే ఇక ఆ చాట్ ఎప్ప‌టికీ మ్యూట్‌లోనే ఉంటుంది. మీరు ఆ చాట్‌ను కావాలంటే అన్ మ్యూట్ చేసుకోవ‌చ్చు.

అంద‌రికీ అందుబాటులోకి
ఈ నెల మొద‌టిలో వాట్సాప్ బీటా యూజ‌ర్ల‌కు ఈ ఆల్వేస్ మ్యూట్ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది.  స‌క్సెస్‌ఫుల్ అవ‌డంతో ఇప్పుడు వాట్సాప్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి తెచ్చింది. |

జన రంజకమైన వార్తలు