వాట్సప్ ...ఈ సోషల్ మీడియా సైట్‌ను వాడని వాళ్లు ఉండరు. స్మార్ట్‌ఫోన్లు ఉన్న వాళ్లు పక్కాగా వాడే యాప్ ఇది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే ఈ యాప్...అప్‌డేషన్‌లోనూ చాలా వేగంగా ఉంటుంది. ఇటీవలే వాట్సప్ అలాంటి అదిరిపోయే ఫీచర్లనే అందుబాటులోకి తెచ్చింది. అందులో మొదటిది వాట్సప్ లైవ్ షేరింగ్... దీంతో మనం ప్రయాణంలో ఉన్నప్పుడు మన స్నేహితులకు లైవ్‌లో మ్యాప్‌లు షేరింగ్ చేసుకోవచ్చు. రెండోది డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్... ఈ ఆప్షన్ నిజంగా గొప్పదే. అయితే ఈ ఆప్షన్ కేవలం ఏడు నిమిషాల వరకే పరిమితం. ఆ తర్వాత మీరు ఏం చేయలేరు. అయితే ఏడు నిమిషాల తర్వాత కూడా పని చేసే ఆప్షన్ వచ్చింది. మరి అదెలాగో చూద్దాం.
ఏడు నిమిషాల తర్వాత కూడా ...
డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్‌ను ప్రవేశ పెట్టిన వాట్సప్ దానికో లిమిట్‌ను సెట్ చేసింది. మీరు వాట్సప్‌లో ప్రతిరోజూ ఎన్నో మెసేజ్‌లు పంపుతుంటారు. ఎన్నో మెసేజ్‌లు, వీడియోలు షేర్ స్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి మన స్నేహితులకు పంపాల్సిన మెసేజ్ పొరపాటున అఫీషియల్ గ్రూప్‌లో షేర్ అయిపోతుంటాయి. మనం తేరుకునేలోపే ఇది జరిగిపోతుంది. అయితే ఆ మెసేజ్‌ను డిలీట్ చేయడం కుదరదు. దానికి ఎక్సప్లనేషన్ ఇచ్చుకోవడమో లేక సారీ చెప్పడమో చేయాల్సి వస్తుంది. అయితే వాట్సప్ కొత్త ఫీచర్ వల్ల మనకు ఈ ఇబ్బంది తగ్గింది. గిల్టీ ఫీలింగ్ పోగొట్టకునే అవకాశం వచ్చింది. ఒకసారి మనం మెసేజ్‌లు పొరపాటున పంపినా కూడా ఆ మెసేజ్‌లను డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఆ మెసేజ్‌లను డిలీట్ చేయడానికి మనకుండే సమయం 7 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత మీరు డిలీట్ చేయలేరు. అయితే తాజాగా వచ్చిన బగ్‌తో సులభంగా డిలీట్ చేయచ్చు.
చాట్ విండో ఓపెన్ ఉంచాలి
ఈ బగ్ ద్వారా డిలీట్ చేయాలంటే ముందుగా మీరు చాట్ విండో ఓపెన్ చేసుకుని ఉండాలి. అంటే మీరు ఒక మెసేజ్‌ను పంపిన తర్వాత ఆ విండోను క్లోజ్ చేయకూడదు. 7 నిమిషాలు దాటినా కూడా ఆ మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చు. మొదటిసారిగా ఈ ప్రయోగాన్ని ఎక్స్‌డీఏ డెవలపర్స్ చేశారు. బేటా వెర్షన్ ద్వారా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. చాట్ విండో ఓపెన్‌గా ఉంటే చాలు డిలీట్ చేయడం కుదురుతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్లో కూడా కావాలంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. ఈ ఫీచర్‌తో పాటు లైవ్ షేరింగ్ ఆప్షన్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది.