లాక్‌డౌన్‌తో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ సమాచార వ్యాప్తి మాత్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. టీవీలు, పేపర్లే కాదు సోషల్ మీడియా కూడా ఇందుకు ప్రధాన కారణం. అయితే సోషల్ మీడియాలో రూమర్స్, దుష్ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే గవర్నమెంట్ వీటిపై కంట్రోల్ పెట్టింది. తరచూగా ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్‌లను అడ్డుకోవాలని సోషల్ మీడియాను ఆదేశించింది. అందుకే మీ వాట్సాప్‌లో కొన్ని ఫార్వర్డ్ మెసేజ్‌లు ఒకసారి ఒక్కరికి మాత్రమేఫార్వర్డ్ చేయగలుగుతున్నారు. మామూలుగా అయితే ఏ మెసేజ్‌నయినా మనం వాట్సాప్‌లో ఐదుగురికి ఫార్వర్డ్ లేదా సెండ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మీ ఫార్వర్డ్ మెసేజ్‌ల్లో చాలావాటికి ఒకసారి ఒక్కరికే పంపగలిగేలా సీలింగ్ పెట్టింది. దీనివల్ల ఫ్రీక్వెంట్‌గా ఫార్వర్డ్ అయ్యే మెసేజ్‌లు ఏకంగా 70 శాతం తగ్గిపోయాయని వాట్సాప్ ప్రకటించింది. ఇదే విషయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సమాచారమిచ్చింది.
గవర్నమెంట్ ఆదేశించింది
వాట్సాప్‌లో దుష్ర్పచారాలు, అబద్ధాలు, రూమర్లు ప్రచారం అవుతుండడంపై సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో దృష్టి పెట్టండి. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళితే వాళ్లు మరింత భయాందోళన పడతారని గుర్తించింది. అందుకే ఏప్రిల్ మొదటి వారంలోనే వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, హెలో వంటి వాటిని పిలిచి దీనిమీద స్ట్రాంగ్‌గా ఆర్డర్స్ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని, దీనికోసం ఏం చేశారో రోజువారి తమకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.
70% తగ్గాయట
ఈ ఆదేశాలు వచ్చాక వాట్సాప్ ఫ్రీక్వెంట్‌గా ఫార్వర్డ్ అయ్యే మెసేజ్‌లను ఒకసారి ఒకరికి మాత్రమే పంపగలిగేలా లిమిట్ పెట్టింది. ఈ లిమిట్ పెట్టాక అత్యధికంగా ఫార్వర్డ్ అయ్యే వాట్సాప్ మెసేజ్‌ల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ఆ ప్లేస్‌లో పర్సనల్ మెసేజ్‌లు ఎక్కువగా పంపుకుంటున్నారు అని వాట్సాప్ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు తెలిపింది. ఆమేరకు వదంతులు ప్రబలకుండా తమవంతుగా అడ్డుకున్నామని వాట్సాప్ చెబుతోంది.