వాట్సప్.. ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్. సింగిల్ మెసేజ్‌లతో పాటు ఎక్కువమందితో కమ్యునికేట్ అయ్యే గ్రూప్ మెసేజ్‌లు ఉండడంతో యూజర్లు వాట్సప్‌కు బాగా అలవాటుపడిపోయారు. ఏ చిన్న విషయం తెలియజేయాలన్నా వాట్సప్ గ్రూప్‌లనే ఆశ్రయిస్తున్నారు. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా వాట్సప్ కూడా ఎప్పటికప్పుడు మార్పులు తెస్తోంది. దీనిలో భాగంగానే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెసేజ్ ఫీచర్‌ని వాట్సప్ తీసుకురాబోతోంది. మరి ఎందుకు తీసుకోస్తుందో చూద్దామా..
ఆటో డిస్ట్రక్ట్
ఇటీవలే వాట్సప్ ఆటో డిస్ట్రక్ట్ మెసేజింగ్ సర్వీస్‌ను ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే ఇది కేవలం వాట్సప్ గ్రూప్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. టెస్టు వెర్షన్లలో భాగంగా ఈ ఫీచర్ రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటికి అందుబాటులోకి వచ్చింది. దీనికి ఓ పేరు కూడా పెట్టారు. అదే డిలీట్ మెసేజెస్. ఆరంభంలో ఈ ఫీచర్‌ని వ్యక్తిగత చాట్, గ్రూప్ చాట్ రెండింటికి అందుబాటులోకి తీసుకు రావాలని అనుకున్న వాట్సప్.. ఇప్పుడు గ్రూప్ చాట్‌కు మాత్రమే పరిమితం చేసింది.
అడ్మిన్లకు మాత్రమే
ఒక గ్రూప్‌లో ఉండే అడ్మిన్లు తమ గ్రూప్ మెసేజ్‌లను మేనేజ్ చేసుకునేలా ఈ ఫీచర్ ఉంటుంది. దీని వల్ల ప్రధాన ఉపయోగం ఒక డ్యూరేషన్ తర్వాత ఆటోమెటిక్‌గా ఈ మెసేజ్‌లు డిలీట్ అయిపోతాయి. పాత చాట్స్, మెసేజ్‌లను వాళ్లు డిలీట్ చేయచ్చు. డివైజ్‌లో కొంత స్పేస్ తీసుకునే వాట్సప్... ఆన్‌లైన్ బ్యాక్ అప్ సైజుని కూడా పెంచుకుంటుంది. అయితే చాలా కాలం క్రితం ఉన్న మెసేజ్‌లు ఇప్పుడు రిలవెంట్ కాదు. వాటిని డిలీట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ మెసేజ్‌లను యూజర్లు మాన్యువల్‌గా డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం అడ్మిన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు ఈ మెసేజ్ గంటా లేదా ఏడాది వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు.