• తాజా వార్తలు

వాట్సాప్ వెబ్ గురించి అంద‌రూ తెలుసుకోవాల్సిన విష‌యాలివీ..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోష‌ల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌.  మొబైల్ యాప్‌గానే కాదు వాట్సాప్‌ను వెబ్ వెర్ష‌న్‌లోనూ వాడుకోవ‌చ్చు. ఇప్ప‌టికే వాట్సాప్ యూజ‌ర్ల‌లో చాలామంది దీన్ని వాడుతున్నారు. అయితే వాట్సాప్ వెబ్ ఇంకా వాడ‌ని వారికోసం దాని గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చూద్దాం. 

 

వాట్సాప్ వెబ్  ఎలా వాడుకోవాలి? 
* వాట్సాప్ వెబ్ స‌ర్వీస్ వాడుకోవాలంటే మీ పీసీ లేదా ల్యాప్టాప్‌లో వాట్సాప్ వెబ్ అని బ్రౌజ్ చేయండి. 
* సెర్చ్ రిజ‌ల్ట్స్‌లో వాట్సాప్ వెబ్‌ను క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. 
* ఇప్పుడు మీ మొబైల్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి పైనున్న త్రీడాట్స్ మెనూను క్లిక్ చేయండి. 
* వ‌చ్చిన ఆప్ష‌న్స్‌లో వాట్సాప్ వెబ్‌ను క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ స్కాన‌ర్ ఓపెన్ అవుతుంది. దీంతో మీ పీసీలో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.
* అంతే మీకు వాట్సాప్ వెబ్ ఓపెన్ అవుతుంది. 

ఇవీ విశేషాలు
* వాట్సాప్ వెబ్.. వాట్సాప్‌కి ఎక్స్‌టెన్ష‌న్ అని చెప్పాలి. ఎందుకంటే మీ యాప్‌లో ఉన్న డేటా అంతా ఒక్క‌సారి వెబ్‌కు క‌నెక్ట్ చేయ‌గానే దానిలో కూడా కనిపిస్తుంది.

* ఒక‌సారి మీరు మీ పీసీలో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేస్తే అది చాలాకాలం అలాగే ఉంటుంది. ప్ర‌తి రోజూ కోడ్ స్కాన్ చేయ‌క్క‌ర్లేదు. ఓపెన్ చేయ‌గానే మీ వాట్సాప్ అకౌంటే క‌నిపిస్తుంది. అక్క‌ర్లేద‌నుకుంటే లాగ‌వుట్ చేసేయొచ్చు.

*వాట్సాప్ వెబ్‌, యాప్ రెండింటినీ ఒకేసారి వాడుకోవ‌చ్చు. 

* ఇమేజ్‌లు, వీడియోలు, పెద్ద ఫైల్స్ పంప‌డానికి వాట్సాప్ వెబ్ సౌక‌ర్యంగా ఉంటుంది. 

* మీరు ఎవ‌రిక‌న్నా మెసేజ్ పంపితే వాట్సాప్ వెబ్ నుంచి పంపారా యాప్ నుంచి సెండ్ చేశారా వాళ్లు తెలుసుకోలేరు. 

* వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్ష‌న్ కూడా ఉంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే నేరుగా డెస్క్‌టాప్ నుంచే యాప్‌ను వాడుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు