వాట్సాప్‌లో ఎవరైనా యాక్టివ్ గా ఉన్నారో లేదో చూడాలంటే ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదా చూస్తాం. ఆన్‌లైన్‌లో లేకపోతే లాస్ట్ సీన్ చూస్తాము. కానీ యూజర్ ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ లాస్ట్ సీన్ డిసేబుల్ చేయడానికి చాలాకాలం కిందటే ఆప్షన్ తీసుకొచ్చింది. ఇది పెట్టుకుంటే మీ లాస్ట్ సీన్ ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నాం కదా.. అదేమీ కాదని మీరు సెట్టింగ్స్‌లో లాస్ట్‌సీన్ డిజేబుల్ చేసినా కూడా మీరు ఎప్పటివరకు ఆన్‌లైన్‌లో ఉన్నారో, మీ లాస్ట్ సీన్ ఎప్పుడో చూపించేస్తోంది చాట్ వాచ్ యాప్.
ఎలా పని చేస్తుంది?
చాట్ వాచ్ ఒక ఐఓఎస్ యాప్. దీనితో ఎవరైనా వాట్సాప్ యూజర్ లాస్ట్ సీన్ తన సెట్టింగ్స్ లో డిజేబుల్ చేసినా కూడా ఎప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఉన్నారో తెలుసుకోవచ్చు. జస్ట్ మీరు ఆ కాంటాక్ట్‌కు మెసేజ్ టైప్ చేస్తే చాలు ఆ పర్సన్ లాస్ట్ సీన్ ఎప్పుడో యాప్ మీకు చూపిస్తుంది. అంతేకాదు ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగిస్తుండడం వల్ల మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న ఇద్దరు యూజర్ల మధ్య చాటింగ్ జరిగిందా లేదా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ యూజర్ల ప్రైవసీని దెబ్బ తీసే అవకాశాలున్నాయి. అయితే వాట్సాప్‌లో చాట్స్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని, అందువల్ల ఇద్దరు వ్యక్తుల చాట్ చేసుకున్నదేమిటో వాట్సాప్ కూడా గుర్తించలేదని, అలాంటప్పుడు కేవలం లాస్ట్‌సీన్ తెలిసినంత మాత్రాన ప్రైవసీ ఏం కోల్పోతారని యాప్ డెవలపర్స్ చెబుతున్నారు.
యాప్‌ను తొలగించేసినట్లేనా?
అయితే ఇటీవల ఐఓఎస్ స్టోర్ నుంచి చాట్ వాచ్ యాప్ ను తొలగించింది. దీనికి కారణమేమిటో తెలియదని, ఈవిషయంపై మాట్లాడతామని చాట్‌యాప్ డెవలపర్స్ చెబుతున్నారు. అంతేకాదు దీని వెబ్ యాప్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.