• తాజా వార్తలు

వాట్సప్‌లో ఈ యాడ్  వస్తుందా, మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే 

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను మరో కొత్త వైరస్‌ భూతం భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లపై 'ఏజెంట్‌ స్మిత్‌’ అనే మాల్‌వేర్‌ దాడి చేసిందని చెక్‌ పాయింట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ సంస్థ తెలిపింది. భారత్‌లో 1.5 కోట్ల ఫోన్లలో ఈ మాల్‌వేర్‌ ప్రవేశించిందని పేర్కొంది. గూగుల్‌కు సంబంధించిన అప్లికేషన్‌గా మారువేషంలో ఈ వైరస్‌ ఫోన్‌లోకి ప్రవేశిస్తుందని, ఫోన్‌లో యాప్‌లను యూజర్‌కు తెలియకుండానే తొలగించి, తాను తిష్ఠవేసి కూర్చుంటుందని చెక్‌ పాయింట్‌ నిపుణులు పేర్కొన్నారు.

ఏజెంట్ స్మిత్ పేరుతో ఓ మాల్ వేర్  మీ ఆండ్రాయిడ్ డివైజ్ ల్లోకి చొరబడి కనిపించకుండా తిష్టవేసి ఉంటుంది. మాల్ వేర్ ఎటాక్ అయినట్టు యూజర్ కు ఎంతమాత్రం అనుమానం రాదు. ఇప్పటివరకూ అడ్వర్టైజ్ మెంట్స్ మొబైల్ స్ర్కీన్ పై డిస్ ప్లే కావడం ద్వారా మాత్రమే గుర్తించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ సంస్థ, చెక్ పాయింట్ అందించిన సమాచారం ప్రకారం గూగుల్ సంబంధించి అప్లికేషన్ రూపంలో ఏజెంట్ స్మిత్ మాల్ వేర్ దాడి ఉంటుంది. ఈ వైరస్ కారణంగా ఆండ్రాయిడ్ డివైజ్ లో సెక్యూరిటీ పరమైన సమస్యలు తలెత్తుతాయి.

మోసపూరిత ప్రకటనలు చూపుతూ ఈ వైర్‌సను హ్యాకర్లు స్మార్ట్‌ఫోన్‌లోకి పంపే ప్రయత్నం చేస్తారని, మన ఫోన్‌లోకి ఈ వైరస్‌ ఒక్కసారి ప్రవేశిస్తే బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు కొల్లగొడతారని చెప్పారు. యాప్స్‌-9 అనే థర్డ్‌పార్టీ యాప్‌ స్టోర్ల నుంచి ‘ఏజెంట్‌ స్మిత్‌' ను డౌన్‌లోడ్‌ చేశారని తెలిపారు.

యూజర్ ప్రమేయం, అనుమతి లేకుండానే ఆటోమాటిక్ గా ఆండ్రాయిడ్ డివైజ్ లో వివిధ మాల్ వేర్ వెర్షన్లతో ఇన్‌స్టాల్డ్ యాప్స్ రీప్లేస్ అవుతుంటాయి. ఆర్థికంగా లబ్ధిపొందడానికి ఈ మాల్ వేర్ మోసపూరితమైన యాడ్స్ డిస్ ప్లే చేస్తుంటుంది. తద్వారా యూజర్ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తస్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఇలాంటి మాల్‌వేర్స్ Gooligan, Hummingbad and CopyCat వంటి వైరస్ లు యూజర్ల డేటాను తస్కరించినట్టు చెక్ పాయింట్ గుర్తు చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి చొరబడినట్టు చెక్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ తన పరిశోధనలో గుర్తించింది. వీటిల్లో 1.5 కోట్ల ఫోన్లు భారత్‌లోనే ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది.విశ్వసనీయమైన యాప్‌ స్టోర్ల నుంచే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి కానీ, థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఆశ్రయించొద్దని సూచించింది.

జన రంజకమైన వార్తలు