• తాజా వార్తలు

వాట్సప్ అలర్ట్ మెసేజ్ చూసుకున్నారా ?

సోషల్ మీడియాను ఇప్పుడు ఏదైనా ఊపేస్తోందంటే అది ఫేస్ బుక్, వాట్సప్ మాత్రమే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ పొద్దున నుంచి సాయంత్రం దాకా అందులోనే మునిగితేలుతున్నారు. వాట్సప్‌తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు కంపెనీ వివిధ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వాట్సప్‌లో ఎవరైనా వేధిస్తే ఇకపై ఫిర్యాదు చేయగల సౌలభ్యాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్ (డాట్‌) ఏర్పాటు చేసింది.

అశ్లీలమైన, అభ్యంతరకరమైన సందేశాలకు కూడా అడ్డుకట్ట వేసేలా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎవరైనా అసభ్యకర మెసేజ్ లు పంపిస్తే జైలు కెళ్లాల్సి ఉంటుంది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కస్టమర్ డిక్లరేషన్‌ ఫారమ్‌లో అంగీకరించిన నిబంధనలను ఉల్లంఘించినట్లే. కనుక ఆ కస్టమర్‌లపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని టెలికామ్ సంస్థలు అన్నింటికీ ఫిబ్రవరి 19న కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

బాధితులు can-dot@nic.inకు ఇమెయిల్ పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డాట్‌ కంట్రోలర్‌ ఆశిష్‌ జోషి ట్వీట్‌ చేశారు. అయితే రుజువుగా స్క్రీన్‌షాట్‌లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫిర్యాదులు సంబంధిత టెలికామ్ ప్రొవైడర్‌తో పాటుగా పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లబడతాయి. అభ్యంతరకరమైన, అశ్లీలమైన, అనధికారిక కంటెంట్‌ అలాగే ఉంటే ప్రొవైడర్ల లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. 

జన రంజకమైన వార్తలు