ఫేస్‌బుక్ సొంతమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది. యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్లను తీసుకురాడం లేక ఉన్న ఫీచర్లను రీడిజైన్ చేయడం లాంటివి చేస్తూ ముందుకువెళుతోంది.అయితే వాట్సాప్ లో ఇప్పటి వరకు మెసేజులు షెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు ఒక వేళా అలా మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ అయిన WhatsApp Scheduler, Do It Later, SKEDit లాంటి యాప్స్ సహాయంతో షెడ్యూల్ చేయాలి. ఈ కింది స్టెప్స్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు వాట్సప్ లో మెసేజ్ లు షెడ్యూల్ చేయవచ్చు.
స్టెప్ 1
గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి WhatsApp scheduler యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది వద్దనుకుంటే వెబ్ సైట్ నుంచి WhatsApp scheduler.apk ఫైల్ ను డౌన్లోడ్ చేయండి
స్టెప్ 2
WhatsApp scheduler యాప్ డౌన్లోడ్ అయిన తరువాత దాన్ని ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసని తరువాత యాప్ బాటమ్ రైట్ లో ఉన్న ‘+' ఐకాన్ ను ట్యాప్ చేయండి.
స్టెప్ 3
అది ట్యాప్ చేయగానే మీీరు కొన్ని కాంటాక్ట్స్ కాని గ్రూపులు కాని కనిపిస్తాయి. ఆ వాట్సప్ గ్రూప్ లేదా ఎవరికైతే పంపాలనుకుంటున్నారో ఆ పర్సన్ కాంటాక్ట్ ను ఓపెన్ చేసి టైం మరియు డేట్ ను సెట్ చేయండి.
స్టెప్ 4
ఫ్రీక్వెన్సీని ఎంచుకుని మీరు ఏదేతై మెసేజ్ పంపాలనుకుంటున్నారో మీ మెస్సేజ్ ను అక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తరువాత దాన్ని షెడ్యూల్ చేయడానికి టాప్-రైట్ కార్నర్ లో ఉన్న ‘Create' బటన్ ని ప్రెస్ చేయండి. మీరు అనుకున్న సమయానికి అది వారికి చేరుతుంది.