• తాజా వార్తలు

ల్యాండ్‌లైన్ నంబర్ ద్వారా వాట్సప్‌ ఉపయోగించడం ఎలా ? 

గ్లోబల్ వ్యాప్తంగా దాదాపు 1.5 బిలియన్ మంది యూజర్లు వాట్సప్ వాడుతున్నారు. ఇది పూర్తి ఉచితంగా లభించడంతో ఈ యాప్ శరవేగంగా పాపులర్ అయింది. ఇన్ స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ ఎంత దూరంలో ఉన్న ఇట్టే కస్టమర్లని కలిపేస్తోంది. హాయ్ అనే మెసేజ్ ద్వారా మనం దగ్గరగా ఉండి మాట్లాడిన ఫీల్ కలిగేలా చేస్తోంది. అయితే ఇది కేవలం  మెసేజ్ ల ద్వారా మాత్రమే కాకుండా ఉచితంగా వాయిస్ వీడియో కాల్స్ బెనిఫిట్స్ ని అందిస్తోంది. దీంతో పాటు ల్యాండ్ లైన్ ద్వారా వాట్సప్ అకౌంటును క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. అదెలాగో చూద్దాం.

స్టెప్ 1
ముందుగా యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి రెగ్యులర్ WhatsApp or its Business appని డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. మీ మొబైల్ ,ట్యాబ్లెట్, ల్యాపీ నుంచి వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.

Step 2
వాట్సప్ యాప్ ఓపెన్ చేయగానే మీకు కంట్రీ కోడ్ అలాగే 10 అంకెల మొబైల్ నంబర్ అడుగుతుంది. అక్కడ మీరు వెంటనే ల్యాండ్ లైన్ నంబర్ ఎంటర్ చేయండి.

Step 3
మీరు నంబర్ ఎంటర్ చేసిన తరువాత మీ నంబర్ కు వెరిఫై మెసేజ్ వస్తుంది. అయితే ఇది కేవలం మొబైల్ ఉన్న వారు మాత్రమే చూసుకోవచ్చు. మరి ల్యాండ్ లైన్ నంబర్ లో ఈ మెసేజ్ వెరిఫికేషన్ చూడలేము. కాబట్టి మీరు ఎసెమ్మెస్ ఫెయిల్ అనే ఆప్సన్ వచ్చే దాకా వెయిట్ చేయండి. ఆ తరువాత మీరు కాల్ మి అనే ఆప్సన్ ఎంచుకోండి. మీరు కాల్ రాగానే ల్యాండ్ లైన్ నుంచి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది.

Step 4
మీ ల్యాండ్ లైన్ కు కాల్ రాగానే మీకు ఆరు అంకెలతో కూడిన ఓ డిజిట్ నంబర్ చెబుతుంది. దాన్ని గుర్తుపెట్టుకుని మీరు వాట్సప్  వెరిఫికేషన్ లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ నంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం.

Step 5
ఆరు అంకెల్ డిజిట్ కోడ్ ఎంటర్ చేసిన తరువాత వాట్సప్ వెరిపికేషన్ పూర్తి అవుతుంది. తర్వాత నుంచి మీరు రెగ్యులర్ వాట్సప్ మాదిరిగానే అందులో అన్ని రకాల పనులు చేయవచ్చు. 

జన రంజకమైన వార్తలు